కోవిడ్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది ఈ మహమ్మారి. ఈ మహమ్మారి బారినుండి తప్పించుకోలేక ప్రాణాలు వదిలేసిన వారు కొందరైతే.. అదృష్టం బాగుండి ఈ మాయదారి రోగం బారినుండి తప్పించుకున్న వాళ్ళు మరికొందరు. అయితే కారోనా సోకిన తరువాత శరీరం బలహీనమవుతుండి. ఈ క్రమంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీని వల్ల ఇతర వైరస్‌లు సులువుగా దాడి చేసే అవకాశం ఉంది. తాజగా కరోనా నుండి కోలుకుంటున్న దశలో బాధితులకు చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోందని, అంతేకాకుండా గోళ్లకు సంబంధిన వ్యాధులు సోకుతున్నాయని తెలిపారు.

హెర్పిస్ అనే చర్మవ్యాధి కరోనా సోకినా రోగుల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఢిల్లీ, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన డెర్మటాలజిస్టు డాక్టర్ డి.ఎం.మహాజన్ చెప్పారు. ఈ హెర్పిస్ సోకడం వారికి నోటిపూత, చర్మంపై బొబ్బలు వస్తాయని అయన అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి ఈ చర్మ సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని అయన తెలిపారు. అయితే చర్మ సమస్యలను మ్యుకోర్‌మైకోసిస్‌గా (బ్లాక్ ఫంగస్) భావిస్తున్నారని తెలిపారు. కానీ ఈ రెండూ చర్మ వ్యాదులు వేర్వేరు అని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇక కరోనా చికిత్సలో మితిమీరి స్టెరాయిడ్లు, ఇతర మందులను తీసుకోవడం వల్ల బాధితుల్లో క్యాండిడా ఫంగస్ సోకుతోందని వెల్లడించారు. దీనివల్ల జననేంద్రియాలపై తెల్ల మచ్చలు కనిపిస్తాయన్నారు.































