మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మనం చేయాల్సిన పనులివే..!!

0
197

మన నిత్య జీవితంలో మనల్ని అనేక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునే లోపు మరో కొత్త సమస్య మనల్ని ఇబ్బందులు పెడుతుంది. చిన్న చిన్న విషయాలకే భయాందోళనకు గురయ్యే వాళ్లు మానసిక సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మనం మన మనస్సును సులభంగా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం.

 

ప్రతిరోజూ మన మనస్సుకు సంతోషం కలిగించిన మూడు విషయాలను రాసుకోవాలి. అలా చేయడం ద్వారా ఎలాంటి విషయాలు మనకు శాంతిని కలిగిస్తున్నాయో, మనం ఎక్కువగా ఇష్టపడుతున్నామో తెలుస్తుంది. ప్రతిరోజూ ఉదయం సమయంలో కాఫీ లేదా టీ తాగినా కాఫీ, టీ ప్రశాంతతకు దోహదపడతాయి. మనం పడుకునే గదిని మరీ చల్లగా కాకుండా, మరీ వేడిగా కాకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

చేసే పనులలో మన ఇష్టానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఆ పనుల వల్ల ప్రయోజనం ఉండేలా చూసుకోవాలి. కుటుంబ సభ్యులకు, నమ్మకమైన వ్యక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలి. వాళ్లు ప్రత్యక్షంగా/ పరోక్షంగా మనలోని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి కారణమవుతారు. ప్రతిరోజూ మన అభిరుచులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మన మెంటల్ హెల్త్ బాగుంటుంది.

మన బాధలను నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ఏ విషయంలోనైనా పాజిటివ్ గా ఆలోచిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఏం చేసినా బలవంతంగా చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొహమాటాలకు పోయి మనం ఇబ్బంది పడటం ఎంత మాత్రం సరి కాదు. గతంలోని చెడు జ్ఞాపకాలను తలచుకోకుండా భవిష్యత్తును అద్భుతంగా మలచుకోవడంపై దృష్టి పెడితే సంతోషం మీ సొంతమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here