భూప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరికీ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కొందరు తెలివితో సులభంగా డబ్బు సంపాదిస్తే మరి కొందరు మాత్రం ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేక పోతున్నామని బాధ పడుతూ ఉంటారు. అయితే డబ్బును సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా కోటీశ్వరులు కావచ్చు. అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే కొన్నిసార్లు లాభాలు సొంతమైతే మరికొన్ని సార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో పోస్టాఫీస్ లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా అదిరిపోయే రాబడులను సులువుగా సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా కొన్ని చోట్ల పెట్టుబడులు పెడితే ఖచ్చితమైన లాభం వస్తుందనే గ్యారంటీ ఉండదు. అయితే పోస్టాఫీస్ లోని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో మాత్రం ఖచ్చితమైన లాభాలు కూడా పొందవచ్చు. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలపరిమితితో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లను అందిస్తోంది.
ఆర్‌డీ, కిసాన్ వికాస్ పత్ర, పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ లాంటి స్కీమ్ ల పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వ్యాపారులు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఒక్కో స్కీమ్ లో వడ్డీ రేట్లు ఒక్కో విధంగా ఉంటాయి.
వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ కాలాన్ని బట్టి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు. మోసపూరిత సంస్థలలో పెట్టుబడులు పెట్టి మోసపోవడం కంటే బ్యాంకులు, పోస్టాఫీస్ లలోని స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదిరిపోయే రాబడులను సొంతం చేసుకోవడంతో పాటు అనేక లాభాలను పొందవచ్చు.































