అసలే వర్షాకాలం. చల్లదనానికి మూగ జీవాలు ఎక్కడపడితే అక్కడ తలదాచుకుంటాయి. చీటకట్లో అయితే ఏ పాము వచ్చి కరుస్తుందో అని ప్రతీ ఒక్కరూ భయపడి ఇంటి నుంచి భయటకు వెళ్లడానికి ఆలోచిస్తారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం చేతిలో ఓ కర్రను పట్టుకొని బయలుదేరతారు. అయితే పట్టపగలే ఓ వృద్ధుడు దారివెంట వెళ్తుండగా అతడి కాళ్లకు ఓ పెద్ద పాము (జెర్రిపోతు) అతడి కాళ్లను చుట్టేసింది. ఆ ఘటనను ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

కానీ అతడు ఏ మాత్రం బెదరకుండా దానిని మెడ పట్టుకున్నాడు. పాము లావుగా పొడవుగా ఉండటంతో రాజయ్య గట్టిగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ఆ పామును పట్టుకొని రాజయ్యకు సాయం చేశాడు. తలను మలిచి భూమిపై పడేసి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపెల్లిలో చోటుచేసుకొన్నది.ఇదంతా అక్కడున్న మరో వ్యక్తి వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆ పామును చంపడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిని ఫారెస్ట్ అధికారులకో లేదా మరేదైనా అడవిలో వదిలేస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. అసలేం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన రాజయ్య (65) ఓ వీధిలో నడుస్తుండగా హఠాత్తుగా ఓ పాము (జెర్రిపోతు) అతడి కాళ్లను చుట్టేసింది.
వెంటనే తేరుకున్న రాజయ్య ధైర్యంగా పాము తలను గట్టిగా పట్టుకోగా, అక్కడే ఉన్న ఓ వ్యక్తి పాము తోకను కాళ్లనుంచి విడదీశాడు. ఆ వెంటనే రాజయ్య దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. అయితే ధైర్య సాహసాలకు కొంత మంది మెచ్చుకుంటుంటే.. మరి కొంతమంది పెదవి విరుస్తున్నారు.































