Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇన్ని రోజులు బేబీ బంప్ ఫోటో షూట్లతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేశారు. తాజాగా ఈ నటి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఆగస్టు 2022వ సంవత్సరంలో ముద్దులోలుకుతున్న బాబు మా జీవితాలలోకి వచ్చారని ఇకపై మా జీవితాలు పూర్తిగా మారిపోతాయని ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని బాబు రాకతో మా జీవితమే మారిపోతుందని తెలుపుతూ…డెలివరీ సమయంలో తనకు ఎంతో సహకరించిన వైద్య సిబ్బందికి నర్సులకు అలాగే తన కుటుంబ సభ్యులందరికీ ఈమె పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. 2007వ సంవత్సరంలో తన కెరియర్ ప్రారంభించిన సోనం కపూర్ పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఈమె 2018 ఆనంద్ అహుజా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఇలా జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈమె ఈ ఏడాది మార్చి నెలలో తాను గర్భవతి అనే విషయాన్ని తెలియజేస్తూ అప్పటినుంచి తన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇక ఈమె లండన్ లో ఎంతో ఘనంగా తన సీమంతపు వేడుకలను కూడా జరుపుకుంది.

Sonam Kapoor: వెళ్ళు వెత్తుతున్న శుభాకాంక్షలు…
ఇలా తన సీమంతానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈమె బిడ్డ పుట్టిన విషయం సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ గా మారడమే కాకుండా ఎంతో మంది తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక తమ ఇంటికి ముద్దులొలికే చిన్నారి రావడంతో తన ఇంట్లో పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.



























