సౌందర్య భర్త ఎవరో తెలుసా? ఆమె మరణం తర్వాత అంత దారుణంగా?

0
857

వెండితెరపై ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి సౌందర్య కర్ణాటక లో జన్మించిన తెలుగు ఇండస్ట్రీలో ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఎలాంటి గ్లామరస్ పాత్రలకు తావివ్వకుండా, అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకొని, తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సౌందర్య తండ్రి పేరు సత్యనారాయణ అతనికి ఇండస్ట్రీ బాగా పరిచయం ఉండటం వల్ల సౌందర్య సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.సినిమాల్లోకి అడుగు పెట్టిన కేవలం కొంత సమయంలోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నేడు సౌందర్య 49 వ జయంతి సందర్భంగా అభిమానులు మరోసారి తన అభిమాన నటిని గుర్తు చేసుకున్నారు. కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సౌందర్య 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

సౌందర్య నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా వెంకటేష్ సరసన నటించిన పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం.. సినిమాలు సౌందర్యకు విపరీతమైన ప్రేక్షక అభిమానులను పెంచేసింది. తెలుగులో బాలకృష్ణ హీరోగా సౌందర్య నటించిన నర్తనశాల సినిమా ఆమెకు చివరి సినిమా. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత 2004వ సంవత్సరంలో బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్లే మార్గమధ్యంలో సౌందర్య ప్రయాణిస్తున్న టువంటి హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో సౌందర్య మృతి చెందారు.

ఈ ప్రమాదంలో సౌందర్య అన్న అమర్ కూడా కన్నుమూశారు. సౌందర్య మృతి చెందే సమయానికి ఆమెకు వివాహం జరిగింది. సౌందర్య 2003వ సంవత్సరంలో తన మేనమామ, బాల్య స్నేహితుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినటువంటి రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన సంవత్సరానికి ఆమె మృతి చెందడంతో రఘు డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు. ఈ క్రమంలోనే రఘు సౌందర్య మరణం తర్వాత 2011వ సంవత్సరంలో అపూర్వ అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని గోవాలో సెటిల్ అయ్యారు.