SP Charan -sonia Agarwal: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు ఎస్పీ చరణ్ అందరికీ పరిచయమే. ఈయన గాయకుడుగా మాత్రమే కాకుండా నటుడిగా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే ఎస్పీ చరణ్ ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే తాజాగా ఆయన మూడో పెళ్లికి కూడా సిద్ధమయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఎస్పీ చరణ్ ప్రముఖ నటి సోనియా అగర్వాల్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం ఎస్పీ చరణ్ షేర్ చేసిన ఒక ఫోటోనే. ఎస్పీ చరణ్ సోనియా అగర్వాల్ తో ఎంతో క్లోజ్ గా ఫోటో దిగి ఆ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ కొత్త ప్రయత్నం అని క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈయన షేర్ చేసిన ఈ ఫోటో ఇలాంటి అనుమానాలకు దారి తీసింది.

ఇక వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఎస్పీ చరణ్ ఈ వార్తలపై స్పందిస్తూ మరొక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలు వీరిద్దరితో పాటు అంజలి, మరొక నటుడు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్న నేపథ్యంలో ఇలా ఫోటోలు దిగారు. అయితే ఈయన మిగిలిన ఇద్దరిని కట్ చేసి వీరిద్దరూ ఉన్న ఫోటోలను షేర్ చేయడమే అన్ని అనుమానాలకు దారితీసిందని చెప్పాలి.
పెళ్లి వార్తలలో నిజం లేదు…
కేవలం వెబ్ సిరీస్ కోసం కొత్త ప్రయత్నం అంటూ క్యాప్షన్ జోడించారే తప్ప వీరి పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఎస్ పి చరణ్ కొట్టి పారేశారు. ఇకపోతే సోనియా అగర్వాల్ 7/G బృందావన కాలనీ సినిమాలో నటించారు. ఈమె కూడా దర్శకుడిని వివాహం చేసుకుని అనంతరం ఆయనకు విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఫోటో దిగడంతో మరో పెళ్లి అంటూ వార్తలు షికార్లు చేశాయి.





























