దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళల కొరకు స్పెషల్ అకౌంట్ సర్వీసులను ప్రారంభించింది. మహిళలు ఈ స్పెషల్ అకౌంట్ ఖాతా ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది.

పవర్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసుల పేరుతో కేంద్రం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సర్వీసుల గురించి పంజాబ్ నేషనల్ బ్యాన్క్ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటనలు చేసింది. పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ పేరుతో మహిళలకు ప్రత్యేకమైన స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చామని.. ఈ స్కీమ్ ద్వారా జాయింట్ అకౌంట్ తెరిచే సదుపాయం కూడా కల్పిస్తున్నామని.. అయితే జాయింట్ అకౌంట్ లో మొదటి పేరు మాత్రం మహిళలదే కావాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది.

మహిళలు సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించి సులభంగా పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ అకౌంట్ ను తెరవవచ్చు. గ్రామాల్లోని మహిళలు 500 రూపాయలు, మండలాల్లోని మహిళలు 1,000 రూపాయలు, పట్టణాలు నగరాల్లో నివశించే మహిళలు కనీసం 2,000 రూపాయలు చెలించి పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ ఖాతాను సులభంగా తెరవవచ్చు. ఈ ఖాతా తెరిచిన మహిళలకు 5 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.

రోజుకు అకౌంట్ లో నుంచ్ 50,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఉచితంగా ఎస్ఎంఎస్ అలర్ట్స్ తో పాటు ప్లాటినం డెబిట్ కార్డును పొందవచ్చు. ఈ ఖాతా తెరిచిన మహిళలకు 50 పేజీల ఫ్రీ చెక్ బుక్ తో పాటు నెఫ్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ఉచితంగా లభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here