రైతులకు శుభవార్త.. పొలం పత్రాల ఆధారంగా రుణం..!

0
305

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా ఒక నిర్ణయం అమలులోకి వఛ్చింది. స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీ ద్వారా రైతులు ఇకపై సులభంగా రుణాలు పొందగలుగుతారు. సహకార బ్యాంకులు, సంఘాల ద్వారా రైతులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ దేశంలో కరోనా వైరస్ విజృంభన వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆరు నెలల క్రితం స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

క్రయవిక్రయాలకు, ఉత్పాదకతకు ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు మాత్రమే లిక్విడిటీ ఫెసిలిటీని వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించిన ఆర్బీఐ తాజాగా ఈ ఫెసిలిటీని సహకార సంఘాలకు సైతం విస్తరించడం గమనార్హం. దీంతో రైతులు సహకార సంఘాల ద్వారా రుణాలను సులభంగా పొందవచ్చు.

రైతులు పొలం పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి ఖరీఫ్ ప్రారంభంలోనే రుణాలను పొందారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల వల్ల రైతులకు గతంతో పోలిస్తే ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో సహకార బ్యాంకులు రుణం తీసుకున్న రైతులకు మరింత రుణం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. గతంలో రైతులు సకాలంలో రుణాలు చెల్లించారో లేదో పరిశీలించి ఈ రుణాలు మంజూరు చేస్తారు.

స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీ ద్వారా రుణాలు తీసుకున్న రైతులు సంవత్సర కాలంలో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాలకు సహకార బ్యాంకులు 8 శాతం వడ్డీలను వసూలు చేయనున్నాయి. రైతులకు పంట చేతికొచ్చే సమయం కావడంతో ఈ రుణాల వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఆప్కాబ్‌ రాష్ట్రంలోని రాష్ట్రంలోని 2,030 ప్రాథమిక సహకార సంఘాలు, బ్యాంకులకు 1,300 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here