దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ళు మరియు రైల్వే స్టేషన్లలో మాస్క్ ను తప్పనిసరి చేసింది. ఇకపై మాస్క్ లేకుండా కనిపించినా, రైల్వే స్టేషన్ల పరిధిలో ఎవరైనా ఉమ్మినా రూ.500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది.

ఈ రూల్స్ మరో 6 నెలలపాటు కొనసాగుతాయని తెలిపింది. ఈ క్రమంలో దగ్గు, జ్వరం, తీవ్ర ఒళ్ళు నొప్పులు, శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రైళ్ళలో ప్రయాణం చేయవద్దని సూచించింది.































