Sreekanth Odela: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నటువంటి ఈయన సడన్గా వివాహం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. దసరా సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో శ్రీకాంత్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టలేదు.

ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. దీంతో ఈయన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఇక శ్రీకాంత్ తాజాగా కరీంనగర్లో వివాహం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈయన పెళ్లి కుదిరి చాలా రోజులైనప్పటికీ దసరా సినిమాకారణంగా ఎన్ని రోజులు పెళ్లి వాయిదా వేసుకున్నారు. దీంతో తాజాగా ఈయన వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది.

కరీంనగర్ లో శ్రీకాంత్ వివాహం జరగగా ఈ వివాహానికి డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. వీరితో పాటు దసరా టీమ్ హీరో నాని కీర్తి సురేష్ కూడా శ్రీకాంత్ పెళ్లికి హాజరయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sreekanth Odela హాజరైన సెలబ్రిటీలు వీళ్లే…
ఈ విధంగా శ్రీకాంత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలు మాత్రం ఎక్కడా తెలియజేయలేదు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొత్త దంపతులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.