Sreeleela: శ్రీ లీల పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమారు పది సినిమాలకు పైగా అవకాశాలను అందుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తదుపరి సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా మరొక అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.
ఈ సినిమాలో నటి రష్మిక మందన్న నటించబోతున్నారని అధికారకంగా ప్రకటించారు అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని కారణాలవల్ల రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఇలా రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని శ్రీ లీల భర్తీ చేస్తున్నారని తెలుస్తుంది.

Sreeleela: రష్మిక స్థానాన్ని భర్తీ చేస్తున్న శ్రీ లీల…
ఇలా వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో శ్రీలీలా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.