ఆ విషయం గురించి బాలకృష్ణ ముందుగా వార్నింగ్ ఇచ్చారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీకాంత్!

0
536

నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాల గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నా కెరియర్ ప్రారంభంలోనే మొదటగా విలన్ పాత్రలు చేశాను ఆ తర్వాత హీరోగా చేశాను అయితే మరోసారి యుద్ధం శరణం సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఈ సినిమా చేసే ముందు దర్శకుడు బోయపాటి మీరు కంగారుపడి విలన్ పాత్రలకు ఒప్పుకోకండి.మీ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశానని సరైనోడు సినిమా సమయంలో బోయపాటి తనకు చెప్పినట్లు వివరించారు. ఇక బాలకృష్ణ తనకు ఇది రెండవ సినిమా అని శ్రీకాంత్ తెలియజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత నీకు మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చాయి కదా అని ఏది పడితే అది ఒప్పుకోకు ఏ సబ్జెక్ట్ ఉన్న సినిమాలను చేయాలో నీకు చెబుతాను అలాగే హీరోగా అవకాశాలు వస్తే అవి కూడా చెయ్యి అంటూ బాలయ్య తనకు ముందుగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here