తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం హీరోగా మారి విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకొని తిరిగే విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలో నటించి అనంతరం హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమాలో వరదరాజులు అనే విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సందర్భంగా అఖండ చిత్ర బృందంతో కలిసి ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడ చిత్ర బృందం ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నో విషయాలను ముచ్చటించిన శ్రీకాంత్ ను అలీ ప్రశ్నిస్తూ ఒక సినిమా సమయంలో డైరెక్టర్ తో గొడవపడి బయటకు వెళ్లారట కదా.. ఆ గొడవ ఏంటని అలీ అడగడంతో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి సంకోచించిన అతను ఒక పెద్ద డైరెక్టర్ అని ఒకే మూమెంట్ పదే పదే మారుస్తూ షూటింగ్ చేయడంతో చిరాకు దొబ్బి అక్కడున్న వస్తువులను నేలకేసి కొట్టి తనతో గొడవపడి వెళ్లిపోయానని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.
ఒకప్పుడు హీరోగా అందరిని కొట్టి ఇప్పుడు విలన్ గా దెబ్బలు కొట్టించుకుంటే ఎలా ఉందని అడుగగా తన కెరియర్ మొదట్లో విలన్ గా దెబ్బలు తిన్నారని ఆ తర్వాత హీరోగా కొట్టానని ప్రస్తుతం తిరిగి దెబ్బలు తినడంతో తనకు ఎలాంటి కొత్త అనుభవం లేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు.


































