SS Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వారిలో ఎస్ ఎస్ తమన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి మ్యూజిక్ డైరెక్టర్ లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా సత్తా చాటుకుంటున్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన తమన్ గురించి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కాని సూపర్ హిట్ పాటలు అందించి స్టార్ హీరోలకు మంచి హిట్లు ఇవ్వటానికి తమన్ ఎంతో కృషి చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా తమ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి తమన్ చేసిన మంచి పని వల్ల ఆయన వార్తల్లో నిలిచాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక మ్యూజిషియన్ కి తమన్ ఆర్థిక సహాయం అందించాడు. తమన్ టీమ్‌లోని మ్యూజిషియన్ ఒకరు క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి కీమో చేయాల్సి వచ్చిందట. అయితే అతని అనారోగ్యం గురించి తమన్‌కు తెలియగానే వెంటనే ఆయన తనకు సహాయం చేశారు.
అతని బాధను చూసి మెరుగైన వైద్యం కోసం అతనికి ఏకంగా 10 లక్షల సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. తాను చేసిన ఈ సహాయం గురించి తమన్ బయట పెట్టలేదు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ సింగర్ గీతామాధురి ముందు బయట పెట్టింది. ఆహాలో ప్రసారమౌతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోలో ఇటీవల ఈ విషయాన్ని గీతా మాధురి వెల్లడించారు.

SS Thaman: మంచి మనసు చాటుకున్న తమన్…
చిన్న సాయం చేసినా.. ఫోటోలు తీసుకుని పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఈ రోజుల్లో తమన్ మాత్రం అంత పెద్ద మొత్తంలో సహాయం చేసినా కూడా తాను చేసిన సాయం గురించి ఎక్కడా బయటపెట్టలేదని, తమన్ గారిది ఎంతో మంచి మనసు అంటూ గీతామాధురి తెలిపింది. అయితే తరచూ తమన్ సంగీతం గురించి ట్రోల్ చేసేవారు ఈ విషయం తెలియగానే తమన్ మంచి మనసు గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.































