స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2021 సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే రెండు భాగాలు ఉంటాయి.

ఒకటి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కాగా రెండోది అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయడం. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సహాయంతో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫోటో, సంతకం అప్ లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఫీజును ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా చెల్లించే అవకాశం ఉంటుంది.

ఏపీలో పది పరీక్ష కేంద్రాలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మూడు పరీక్ష కేంద్రాలను ఈ పరీక్షల కొరకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here