Hero Kathi Kantharao Sons : 400 సినిమాలలో నటించిన ఒకప్పటి స్టార్ హీరో పిల్లలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు !

0
308

Hero Kathi Kantharao Sons : సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలిగి చివరికి దీన పరిస్థితిలో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారి చివరి రోజులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు.ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో నటుడు కాంతారావు ఒకరు.

ఈ విధంగా నాలుగు వందల సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఈయన పిల్లలు ప్రస్తుతం సాయం చేయాలని కోరుతున్నారు.తన తండ్రి సినిమాలలో నటిస్తూ సినిమాలపై మక్కువతో తన ఆస్తులు అన్ని అమ్మి సినిమాలు చేశారని ఇలా సినిమాలలో నష్టపోవడం వల్ల ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు.

ఒకప్పుడు తమకు మద్రాసులో పెద్ద బంగ్లాలు కూడా ఉండేవి అయితే ప్రస్తుతం తల దాచుకోవడానికి నిలువ నీడ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము అదే ఇంట్లో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తమపట్ల చొరవ చూపి ఇల్లు కేటాయించాలనీ వేడుకున్నారు.

Star Hero: ఎన్టీఆర్ ఏఎన్నార్లకు పోటీగా నటించిన కాంతారావు…

సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో జన్మించిన కాంతారావు సినిమాలపై మక్కువతో నాటకాలు వేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారికి ఏమాత్రం తీసిపోకుండా సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కాంతారావు పిల్లలు ప్రస్తుతం దీన పరిస్థితిలో ఉండి ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.