Krithi Shetty: తొలి సినిమాతోనే ఎంతో క్రేజ్ తెచ్చకుంది కృతి శెట్టి . ‘ఉప్పెన’ మూవీ పెద్ద హిట్ కావడంతో ఆసినిమాలో చేసిన బేబమ్మ క్యారెక్టర్ పేరే కృతి శెట్టికి స్థిరపడిపోయింది. తన అందం, నటనతో కుర్రకారు మనసుల్లో అలజడి రేపింది కృతి శెట్టి. ఉప్పెన మూవీ భారీ హిట్ కావడంతో బేబమ్మకు.. వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఏకంగా అరడజన్ సినిమాకు ఒప్పుకుంది.

తాజాగా నాని హీరోగా వచ్చిన శ్యాంసింగరాయ్ సినిమాలో కృతి శెట్టి అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో భవిష్యత్తులో మరిన్ని సినిమా అవకాశాలు రానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నాగార్జున, నాగచైతన్య లీడ్ రోల్స్ లో వస్తున్న క్రేజీ మూవీ ‘ బంగార్రాజు’లో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదల కాబోతోంది. దీంతో మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లను చేస్తోంది. తాజాగా కృతి శెట్టి, బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ .. అలీతో సరదాగా షోలో సందడి చేశారు.

అయితే ఈ షోలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది కృతి శెట్టి. ఉప్పెన హిట్ అయిన తర్వాత టాలీవుడ్‌లో ఓ పెద్ద హీరో బోకేతోపాటు పెద్ద గిఫ్ట్ కూడా పంపించారట. ఎవరాయనా? అని ప్రశ్నించాడు అలీ. అందుకు కృతి రియాక్ట్ అవుతూ పేరు చెప్పేందుకు తడబడినట్టుగా కనిపించింది. అయితే అందులో అయన ‘యువర్ ఏ బోర్న్ స్టార్’ అని చాలా మంచి మాటలు రాశారని తెలిపింది కృతి. ఆయన పక్కన హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా.. అని అలీ ప్రశ్నించగా ఈ అమ్మడు తటపటాయించింది.
Krithi Shetty : కేకే అంటే కృతి కృష్ణఅని అమ్మడు..
ఇదిలా ఉంటే ఈ షోలో కృతి శెట్టి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆలీ.. కృతి శెట్టి ముద్దు పేరును బయటపెట్టాడు. నీ ముద్దు పేరు ‘బుంగి’ అని ఆలీ చెప్పగా.. మీకెలా తెలుసు అని కృతి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే కాకుండా తనకు మేము పెట్టిన పేరు కేకే అంటూ కళ్యాణ్ క్రిష్ణ చెప్పుకోచ్చారు. దీంతో కేకే అంటే కృతి కృష్ణఅని అమ్మడు సెలవిచ్చింది. ఇదిలా ఉంటే తను ఇప్పటి వరకు25 ప్రొడక్ట్ ల యాడ్స్ లో నటించానని తెలిపింది. అయితే మొదటగా తాను బిస్కేట్ యాడ్స్ లో చేశానని చెప్పడంతో పక్కనున్న దర్శకుడు నవ్వులు పూయించారు. చాక్లెట్, బిస్కేట్స్ అంటూ ఆటపట్టించాడు. ఇప్పటి వరకు బేబమ్మ వెంట పడ్డ హీరో ఎవరైనా ఉన్నారా.. అంటూ ఆలీ ప్రశ్నించగా… లేదు అంటూ కృతి సమాధానం ఇచ్చింది.
































