Viral Video: ఈ భూమిపైన ఎన్ని విషయాలు తెలుసున్నా మరికొన్ని మిగిలే ఉంటాయి. ముఖ్యంగా సముద్రం గర్భంలోని వింతలు, విశేషాలు ఎంత తెలుసుకున్నా… కొంత మిగిలే ఉన్నాయి. మనకు తెలిసిన సముద్ర గర్భం కొన్ని వందల మీటర్ల వరకే ఉంది. ఆ తరువాత కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మనిషి ఎక్స్ ప్లోర్ చేయలేదు.

అయితే అక్కడ ఇప్పటికీ అంతుబట్టని వింత జీవులు, జలచరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా… ఇటీవల బ్రెజిల్ లో జరిగిన ఓ సంఘటన గగుర్పాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దక్షిణ బ్రెజిల్ లో ఓ వింత సముద్ర జీవి.. ఓ వ్యక్తి వెంట పడిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. రాత్రి పూట్ స్టీమర్ లో చేపల వేటకు వెళ్లిన సమయంలో సముద్రం నుంచి వచ్చిన ఓ వింత జీవి సదరు వ్యక్తి వెంట పడింది. ఆ సమయంలో వింతజీవి కళ్లు మెరుస్తూ కనిపించాయి. విద్యుత్ బల్బుల తీరు వెలుగుతూ కనిపించింది.
నీటిలో ఈదుతూ.. వేగంగా దాడి
భయపడుతూ.. ఆ వ్యక్తి స్టీమర్ ను వేగంగా పోనిచ్చాడు. ఆ సమయంలో కూడా ఆ వింత జీవి స్టీమర్ ను వెంబడించింది. ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో ఈదుతూ.. వేగంగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. భయంతోనే సదరు వ్యక్తి ఆ వీడియోను సెల్ ఫోన్ లో బంధించాడు. నల్లటి దేహంతో మెరుస్తున్న కళ్లతో స్టీమర్ ను వెంబడిస్తున్న ఈ జీవి వీడియో గగుర్పాటుకు గురిచేసింది. తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul.
— Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022
Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK





























