America: అమెరికా భౌగోళికంగా చాలా పెద్ద దేశం. అక్కడ ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రకమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితులుంటాయి. ఒక దగ్గర వేసవి కాలం ఉంటే, మరో ప్రాంతంలో మంచు కురుస్తుంటుంది. మరోవైపు వరదలు ముంచెత్తుతుంటాయి.

హరికేన్లు, తుఫాన్లు, అగ్నిప్రమాదాల సర్వసాధారణం. అమెరికాలో ఉన్న 50 రాష్ర్టలలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ రాష్ర్టంలో వింత శబ్దాలు అమెరికన్లకు నిద్రపట్టనీయడం లేదు.

భారీ శబ్దాలతో రాత్రికి రాత్రే చెట్లు విరిగిపడుతున్నాయి. ఈ శబ్దాలతో జనం బేంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతేడాది ఈ రాష్ర్టంలో ఫ్రీజ్ అనే మంచు తుపాను వచ్చింది. ఈ తుపాను ప్రభావం పెద్దపెద్ద చెట్లపై పడింది.
ఈ పరిస్థితులపై టెక్సాస్ ప్రభుత్వం..
ఉన్నట్టుండి అర్ధరాత్రుళ్లు శబ్దాలతో కూలిపోతున్నాయి. ఈ సంఘటనలు ఎక్కువగా మంచు కురిసే ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు టెక్సాస్ వాసులకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై శాస్ర్తవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లలో ఉండే ఓ ద్రవం మంచుకు ప్రభావితమై కూలిందుకు కారణమతోందని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. చెట్ల బెరడు ఊడిపోవడం, కొమ్మలు విరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై టెక్సాస్ ప్రభుత్వం అప్రమత్తతను ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని హుకూం జారీ చేసింది. అర్ధరాత్రుళ్లు చెట్లకు సమీపంలో ఉండరాదని ప్రజలకు సూచిస్తోంది.































