Sudigali Sudheer : జబర్దస్త్ నుండి బాగా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ కి బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులంతా ఆయనను బుల్లితెర పవర్ స్టార్ అని అంటుంటారు. కమెడియన్ గా మొదలయిన సుధీర్ ఆ తరువాత ఢీ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలా అంచెలంచాలుగా ఎదిగిన సుధీర్ సినిమాల్లో హీరో పక్కన పాత్రలను చేస్తూ మరో వైపు సినిమాల్లో హీరో గా కూడా అవకాశాలను అందుకున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లతో బిజీ గా ఉన్న సుధీర్ ఈటీవీ నుండి పక్కకు తప్పుకున్నాడు. తాజాగా మళ్ళీ ఈటీవీ లోకి రీ ఎంట్రీ ఇస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈటీవీ నుండి బయటకి… రష్మీ తో పెళ్లి…
సుధీర్ హీరోగా సినిమాలను చేస్తూ ప్రస్తుతం జీ తెలుగు, మా టీవి లలో కూడా హోస్ట్ గా కనిపించాడు. ఇక మా టీవీ లో రెండు షోలలో చేస్తున్న సుధీర్ మళ్ళీ ఈటీవీ కి వచ్చేస్తానని అంటున్నాడు. మల్లెమాల సంస్థతో ఎలాంటి సమస్యలు లేవని, కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల మల్లెమాల వారిని రెమ్యూనరేషన్ పెంచమని అడిగినపుడు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నాం కొద్ది రోజులు ఆగమని చెప్పడంతో నాకు ఫైనాన్సియల్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల బయటికి వెళ్తానని చెప్పి వచ్చానని మళ్ళీ ఈటీవీ లో పనిచేస్తానని చెప్పాడు సుధీర్.

త్వరలో మళ్ళీ వస్తానని కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే అంటూ చెప్పాడు. ఇక రష్మీ తో పెళ్లి పక్కన పెడితే అసలు పెళ్లి ఎప్పుడు అన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు సుధీర్. పెళ్లి మీద ఆసక్తి ఇప్పట్లో లేదని ఇక రష్మీ కి తనకు మధ్య ఉన్నది కేవలం ఆన్ స్క్రీన్ బంధం మాత్రమే అంటూ చెప్పాడు. మా మధ్య ఏమీ లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. కేవలం రేటింగ్స్ కోసం మాత్రమే ఆ లవ్ ట్రాక్ అది అంతే తప్ప మా మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు.






























