Sudigali Sudheer: దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో శ్రీధర్ సీపానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ కీలకపాత్రలో నటించడంతో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ వేడుకకు సుధీర్ అభిమానులు తరలివచ్చారు. ఇక వేదికపై సుధీర్ మాట్లాడుతూ ఉండగా పెద్ద ఎత్తున అభిమానులు ఈలలు వేస్తూ గోల చేశారు.ఇకపోతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు కేకలు వేశారు.
ఈ విధంగా అభిమానులు గోల చేస్తుండగా రాఘవేంద్రరావు అభిమానులను సైలెంట్ గా ఉండాలని కోరారు. ఈయన పలుమార్లు చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం వారి అత్యుత్సాహం కనబరిచారు. అయితే ఎంత చెప్పినా వినకపోయేసరికి సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు మండిపడ్డారు. ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? పెద్ద చిన్న అనే తేడా లేదా? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు?గమ్మున ఉండకపోతే అందరిని బయటికి పంపించేస్తా అంటూ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sudigali Sudheer: ఎదుగుదలను ఓర్చుకోలేరు…
ఈ విధంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సుధీర్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మండిపడిన ఫ్యాన్స్ ఏకంగా దర్శకేంద్రుడిని ప్రశ్నిస్తున్నారు. సుదీర్ స్థానంలో ఏ సూపర్ స్టారో, ఏ మెగాస్టారో ఉంటే ఇలాగే మీ నోరు లేచేదా?చిన్నవాళ్లు ఎదుగుతుంటే మీలాంటి పెద్దవాళ్లు ఎప్పటికీ ఓర్చుకోలేరు అంటూ పెద్ద ఎత్తున రాఘవేంద్రరావు పై సుదీర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.































