తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై సుడిగాలి సుదీర్ హంగామా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా, మెజీషియన్ గా, యాంకర్ గా ఇలా వివిధ రంగాలలో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

జబర్దస్త్ షో ద్వారా గత కొన్నేళ్లుగా ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాడు. ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న కమెడియన్స్ లో సుడిగాలి సుదీర్ నెంబర్ వన్ కమెడియన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.సుధీర్ నెలలో 30 రోజులు బిజీగా ఉంటూ చాలా వరకు ఆస్తులు పోగేసుకున్నాడు. సుధీర్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లిఫై సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీని ప్రేమిస్తున్నాడు అంటూ ఇలా ఎన్నో రకాల కథనాలు వినిపించాయి. అంతేకాకుండా బుల్లితెరపై ఇప్పటికే రష్మి కి సుధీర్ కి పెళ్లి కూడా చేశారు. సుధీర్ కి 34 ఏళ్ల వయసు దాటిపోవడంతో వెంటనే పెళ్లి చేయాలి అని సంబంధాల వేటలో పడినట్లు సమాచారం.
ఇందుకోసం అతని స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శీను కూడా కాస్త సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అతని ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఒక సంబంధం కుదిరినట్టు తెలుస్తోంది.ఆ సంబంధం సుధీర్ కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పినట్లు సమాచారం. ఒక అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతి అని తెలుస్తోంది. ఈ విషయంపై సుధీర్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.




























