Sudigali Sudheer: జబర్ధస్త్ కామెడీ షో.. ఈ పేరు చెప్పగానే చాలామందికి కొన్ని పేర్లు టక్కున గుర్తుకు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునే వ్యక్తి సుడిగాలి సుధీర్. మొదట్లో ఈ షోలో అతడు సీనియర్ కమెడియన్ వేణు స్కిట్ లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అతడి కామెడీ టైమింగ్స్.. అతడి నటన చూసి.. ఈ టీవీ మల్లెమాల ప్రొడక్షన్స్ అతడిని టీమ్ లీడర్ గా ప్రమోట్ చేశారు.

ఇక ఆ తర్వాత యాంకర్ రష్మీతో కలిసి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఇద్దరు కలసి.. ప్రేమికులుగా.. ఎన్నో వందల స్కిట్లను చేసి.. ప్రేక్షకుల్లో ఓ భావనను క్రియేట్ చేశారు. వారిద్దరి కలిసి ఏ షోలో కనిపించినా ఆ షో రేటింగ్స్ విపరీతంగా పెరిగిపోయేవి.

అయితే సుడిగాలి సుధీర్ కు సంబధించి ఓ వార్త సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. దీని గురించి తెలుసుకుందాం. ఇటీవల యాంకర్ రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకుందని.. అందుకే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
అతడి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా..
అంతే కాదు.. అతడు కూడా వేరే అమ్మాయినీ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని కూడా అనుకున్నారట. అయితే ఇప్పటికీ యాంకర్ రష్మీతో అతడు ప్రేమలో ఉన్నాడని.. ఆ కారణంతోనే అతడు పెళ్లిని వాయిదా వేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ఆమెకు పెళ్లి అయిందనే వార్తలు బలంగా వినిపిస్తుండటంతో.. అతడి ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, రాంప్రసాద్ పెళ్లి ప్రయత్నాలు సీరియస్ గా మొదలు పెట్టారట. అతడి వయస్సు కూడా పెరిగిపోతుండటంతో.. అతడి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారట. ఇక ఆ అమ్మాయి సుధీర్ సొంత జిల్లాకు చెందని యువతి అని తెలుస్తోంది. సుధీర్ కు కూడా సంబంధం నచ్చి వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు. అయితే ఇటువంటి వార్తలు అతడి పెళ్లిపై వస్తున్నా సుధీర్ ఇంతవరకు స్పందించలేదు.