Sukesh chandra: 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో భాగంగా నిందితుడిగా తేలినటువంటి సుకేష్ చంద్రన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ కేసులో భాగంగా పోలీసులు విచారణ చేపట్టగా ఈ మనీ లాండరింగ్ కేసులో నటి జాక్వలిన్ కి కూడా సంబంధం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున విచారణ చేపట్టారు.

ఇప్పటికే ఆమెపై విచారణ జరపగా అధికారులు తనకు కూడా ఇందులో ప్రమేయం ఉంది అంటూ నిర్ధారణకు వచ్చారు. ఇలా సుఖేష్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో సుమారు 12 కోట్ల విలువచేసే బహుమతులను జాక్వెలిన్ కి అందించినట్లు తెలియడంతో తనకు శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో సుఖేష్ తనని కాపాడటం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే జాక్వెలిన్ అమాయకురాలంటూ సుకేష్ ఏకంగా లాయర్ కు లెటర్ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సుఖేష్ లాయర్ కు లేఖ రాస్తూ జాక్వలిన్ పూర్తిగా అమాయకురాలని తనకు ఈ కేస్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదని తెలిపారు. తనతో రిలేషన్ లో ఉన్న నేపథ్యంలో తనకు గుర్తుగా కొన్ని బహుమతులు ఇచ్చాను అయితే వాటిని నా సొంత సంపాదనతో కొన్న బహుమతులు అంటూ సుఖేష్ వెల్లడించారు.

Sukesh chandra: సొంత డబ్బుతో కొన్నవే..
ఈ విషయంపై విచారణ జరిపితే నిజానిజాలు తెలుస్తాయని ఇందులో తన ప్రమేయం ఏమాత్రం లేదని ఈ కేసుకి తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదంటూ ఈ సందర్భంగా ఈయన లాయర్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రియురాలిని కాపాడటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈయన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.






























