Sukumar: విరూపాక్ష సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ఈయన కూడా డైరెక్టర్ సుకుమార్ వద్ద శిష్యరికం పొంది దర్శకుడిగా మారారు. ఇలా సుకుమార్ శిష్యుడిగా ఈయన విరూపాక్ష సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఏలూరులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుకుమార్ డైరెక్టర్ కార్తీక్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ నా వద్దకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు అతని జీవితం చాలా చిన్నదని తెలిపారు.ఆయన ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నారు. తన జీవితం మొత్తం స్టెరాయిడ్స్ తీసుకునే బ్రతకాల్సి ఉంది.
ఇక డాక్టర్లు కూడా కార్తీక్ ఐదారు సంవత్సరాలకు మించి బ్రతకరని చెప్పారు.అయితే ఈయన ఆరోగ్య విషయంలో తన తల్లి ఎంతో శ్రద్ధ తీసుకుందని ఆమె దీవెనల వల్లే ఈయన క్రమక్రమంగా వ్యాధి నుంచి బయటపడ్డారని సుకుమార్ తెలిపారు. కార్తీక్ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన వ్యాధి గురించి బాధపడకుండా తాను చనిపోయేలోపు ఒక సినిమాకి డైరెక్టర్గా గుర్తింపు పొంది చనిపోవాలని అనేవారు.

Sukumar: చనిపోయేలోపు డైరెక్టర్ అవ్వాలి…
ఆయన అనుకున్న విధంగానే నేడు విరూపాక్ష సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని సుకుమార్ వెల్లడించారు.అయితే ప్రస్తుతం కార్తీక్ పూర్తిగా తన ఆరోగ్య సమస్య నుంచి కోలుకున్నారని ఇదంతా తన తల్లి వల్లే జరిగింది అంటూ ఈ సందర్భంగా సుకుమార్ తన శిష్యుడు కార్తీక్ అనారోగ్య సమస్యల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























