Suma -Rajeev Kanakala: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటిగా సందడి చేశారు. అనంతరం సీరియల్స్ లో కూడా నటించారు. అయితే పలు సినిమాలు సీరియల్స్ లో నటించిన ఈమె యాంకర్ గా స్థిరపడ్డారు. మలయాళీ అమ్మాయి అయినటువంటి సుమ తెలుగింటి కోడలుగా అడుగుపెట్టడమే కాకుండా యాంకర్ గా అద్భుతంగా తెలుగు మాట్లాడుతూ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇలా సుమ వారంలో ఏడు రోజులు ఎంతో బిజీగా గడుపుతూ నిత్యం పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.ఇలా నిత్యం ఏదో ఒక షూటింగ్ తో బిజీగా ఉన్నటువంటి ఈమె భారీ మొత్తంలో సంపాదిస్తున్నారని కూడా తెలుస్తోంది.
ఇలా బుల్లితెరపై ఎంతో బిజీగా గడిపే సుమ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన భర్త పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Suma -Rajeev Kanakala: వెల్లు వెత్తుతున్న శుభాకాంక్షలు
సుమ భర్త రాజీవ్ కనకాల గురించి మనకు సుపరిచితమే ఈయన ఎన్నో సినిమాలలో నటుడుగాను విలన్ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే ఈయన నవంబర్ 13వ తేదీ తన 53వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సుమా కనకాల దగ్గరుండి తన భర్త చేత కేక్ కట్ చేయించడమే కాకుండా టైటానిక్ లెవల్లో వీరిద్దరూ ఓ పడవలో ప్రయాణిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి అభిమానులు రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
































