సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్’. ఎస్ ఒరిజినల్స్, ఆర్.కె.సినీ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కథానాయకుడు సందీప్‌కిషన్, దర్శకులు బుచ్చిబాబు సానా, కిషోర్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జయకిషోర్ మాట్లాడుతూ.. తన సినిమా కొవిడ్ కారణంగా ఆలస్యం కాలేదని.. ఒక సాంకేతిక నిపుణుడి దగ్గర ఎనిమిది నెలలు ఆగిపోయిందని.. ప్రస్తుతం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.
మధురానుభూతుల్ని పంచుతూ, అందరినీ మెప్పిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “ చిత్ర బృందమంతా షార్ట్ ఫిల్మ్‌ల నుండి వచ్చినా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ”అని తెలిపారు.
తనకు హీరోగా లైఫ్ ఇచ్చింది కూడా షార్ట్ ఫిల్మ్ దర్శకులే.. ఈ సినిమ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇక తాను హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇది అంటూ సన్నీ పేర్కొన్నాడు. ఇతకు ముందే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.































