Singer sunitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సింగర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి పాతికేళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా సునీత తన పాతికేళ్ల ప్రస్థానం పూర్తికావడంతో అభిమానులకు చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీ సునీత శిల్పకళావేదికలో గాయని సునీత, సంగీత దర్శకుడు స్లీఫెన్ దేవస్సీల సంగీత విభావరి జరగనుంది. బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గురువారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పోస్టర్‌ను సునీత, ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్ నిర్వాహకుడు నార్ల శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగీత విభావరి తన జీవితంలో ఎప్పటికీ ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని తెలిపారు. అలాగే ఈ పాతికేళ్ళ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ నిత్యం తన వెంటే ఉంటూ దివంగత బాలు గారు తనని ఎంతగానో ప్రోత్సహించారని బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకున్నారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ.. విజయవంతం చేయాలి:
ఇక ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ సంగీత విభావరిని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సునీత తెలియజేశారు. ఇకపోతే సునీత తన రెండవ వివాహం తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా సునీత ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు.



























