తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ హీట్ ఎక్కింది. మానస్, సన్నీ, జెస్సీ లో రెచ్చిపోయారు. జెస్సీ రెచ్చిపోయి సన్నీకి దీటుగా నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా తన నిర్ణయం సరైనది అంటూ బల్లగుద్ది చెప్పాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ గురించి చర్చ జరిగింది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ విజయం సాధించి,నెక్స్ట్ వీక్ కీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక జెస్సీ సంచాలకుడిగా ఈ ఫైనల్ టాక్స్ జరిగింది. ఈ నేపథ్యంలోనే జెస్సి తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని మానస్, సన్నీ లు వాదిస్తున్నారు.

అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని మానస్ తో సన్నీ చెప్పాడు. ఈ క్రమంలోనే మానస్ మరొకసారి బిగ్ బాస్ రూల్స్ ని తిరిగి చదివి వినిపించాడు. సంచాలకుడు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు.షణ్ముఖ్ జస్వంత్, సిరి కి పేవర్ గా వ్యవహరించాలి అని వారు ఆరోపించారు. ఈ విషయంలో విశ్వ తాను మాట్లాడింది తప్పు అయితే సారీ అంటూ వెళ్లిపోయాడు. ఆ తరువాత సన్నీ, మానస్ లు కూర్చుని మాట్లాడుకున్నారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు వరెస్ట్ ఫర్ పెర్మర్ అనే టాస్క్ ను ఇచ్చాడు. ఈ టాస్క్ హౌస్ ని మరింత హీటెక్కించిందీ.ఈ టాస్క్ లో సన్నీకి, కాజల్‌కి మూడు ఓట్లు వచ్చాయి. కెప్టెన్‌గా షణ్ముఖ్ సన్నీని వరస్ట్ పర్ ఫర్మెర్‌గా నిర్ణయించారు. అప్పుడు సన్నీ తనని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించాడు. నిన్నటి టాస్క్ విషయంలో సన్నీ చేసింది కరెక్ట్ కాదని, ఆయన ఫిజికల్‌గా వెళ్లాడని, అది తనకు నచ్చలేదని చెప్పాడు షన్ను.
తాను ఫిజికల్ చేయలేదని, మూమెంట్ ఇచ్చానని వారించాడు సన్నీ. ఈ గొడవ తారా స్థాయికి చేరుకుంది. సంచాలకుడు సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించాడు సన్నీ. ఓడిపోయారని జెస్సీ అంటే ఓడించారని సన్నీ అంటాడు. ఇలా జెస్సీ, సిరి,సన్నీ,మానస్‌ల మధ్య గొడవ పీక్‌లోకి వెళ్లింది.మొత్తంగా సన్నీ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. జెస్సీకి, కెప్టెన్ షణ్ముఖ్‌కి చుక్కలు చూపించాడు. అయితే జెస్సీ కూడా రెచ్చిపోవడం ఈ రోజు ఎపిసోడ్ మరో హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఫైనల్‌గా వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా సన్నీని నిర్ణయించి ఆయన్ని జైలుకి పాలయ్యారు. ఎంతగానో వాదించిన సన్నీ జైలుపాలయ్యారు.































