సూపర్ 30 ఎంపికకు ఈసారి ఎంట్రెన్స్ టెస్టు నిర్వహణ.. దరఖాస్తుల ఆహ్వానం

0
95

పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి పలు విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలా వాటికి ఎంపిక కావాలంటే దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఉచిత శిక్షణ అనేది అంతక ముందు జరిగేది. కానీ ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండటంతో పరీక్షలో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయో వాళ్లను ఎంపిక చేస్తున్నారు. అలాంటిదే ఇక్కడ పాట్నాలోని ఓ విద్యా సంస్థ కూడా ఇలానే చేస్తోంది. పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరడానికి అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు “సూపర్ 30” అనే ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది.

దీనిని గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ ఈ సూపర్ 30 కోచింగ్ ప్రోగ్రామ్​ను ప్రారంభించారు. ప్రతీ సంవత్సరం 30 మందిని ఎంపిక చేయనున్నారు. అంతక ముందు ఎలాంటి ఎంట్రెన్స్ టెస్టు లేకుండా.. తీసుకునేవారు. కానీ ఈ సారి అలా కాకుండా ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. 2022 మార్చి లో ఒక పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపాడు.

బుందేల్‌ఖండ్ పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటున్నారు.. వారు గొప్ప ఆసక్తిని కనబరిచారు. వాళ్లు ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ పట్ల ఆసక్తి కనబరిచారని.. అలాగే, సాధారణ పోటీలకు కూడా వారు మార్గదర్శకత్వం కోరుకుంటున్నారని కుమార్ తెలిపారు. వారి చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాడు. అధికారిక వెబ్‌సైట్ లో ఈ కార్యక్రమంకు సంబంధించి నోటిఫికేషన్ ఉందని.. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన విభాగాల (EWS) నుండి ప్రతిభావంతులైన వారి కోసం దరఖాస్తులను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

వారి నుంచి 30 మందిని ఎంపిక చేస్తామన్నారు. సూపర్ 30 అనేది పాట్నాలోని రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోచింగ్ ప్రోగ్రామ్ కింద నిర్వహించబడుతోంది. యుపిలోని హమీర్‌పూర్ జిల్లాకు చెందిన కుమార్ దీనిని నిర్వహిస్తున్నాడు. అక్కడ 2021 లో విద్యారంగానికి చేసిన కృషికి స్వామి భ్రమానంద్ అవార్డుతో అతడిని సత్కరించారు. గురుకుల కాంగ్రీ (యూనివర్సిటీగా పరిగణించబడుతుంది) హరిద్వార్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నుండి అవార్డు అతడు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here