సుప్రీం కోర్టులోని ఉద్యోగికి కరోనా పాజిటివ్…!!

0
202

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక వైపు ఈ మహమ్మారి కట్టడికోసం లాక్ డౌన్ అమలులో ఉన్నా… కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో ఈ మహమ్మారి వ్యాప్తి కాస్త మెరుగ్గానే అనిపిస్తున్నా రోజు రోజుకు పెరుగుతున్న కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

మరోవైపు తాజగా సుప్రీం కోర్టు లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో సుప్రీం కోర్టులో ఉన్న ఇద్దరు రిజిస్ట్రార్లు క్వారంటైన్ కి తరలించారు. కాగా, కరోనా సోకినా వ్యక్తి గత వారం రోజుల్లో రెండు సార్లు సుప్రీం కోర్టుకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో అతడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిసాడు అనే దానిపై పోలీసులు దృష్టిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here