Supriya sister Pushpalatha : విజనగరంలో సంచలనం రేపిన సాయి సుప్రియ 13 ఏళ్ల నిర్భంధం ఇష్యూలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి సుప్రియనే కాకుండా ఆమె తోడి కోడలు పుష్పలత ను కూడా మధుసూదన్ అతని కుటుంబం ఎలా వేధించారో సాయి సుప్రియ ఉదంతం తరువాత మీడియా ముందుకు వచ్చిన పుష్పలత వివరించారు. మధుసూదన్ తమ్ముడు దుర్గ ప్రసాద్ భార్య అయిన పుష్పలత ఆమెను అత్తింటి వారు పెట్టిన టార్చర్ గురించి వివరించారు.

కుక్కకి పెట్టినట్టు అన్నం పెట్టేవారు…
మధుబాబు కుటుంబం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గోదావరి మధుబాబు తమ్ముడు వెంకట దుర్గ ప్రసాద్ కూడా తన భార్యను టార్చర్ చేయడంతో ఆమె అక్కడి నుండి బయటకు వచ్చి వేరుగా ఉంటోంది. ఐదేళ్లుగా భర్త ఎక్కడున్నాడో కూడా తెలిదని సాయి సుప్రియ ఇష్యూ వల్ల మీడియాలో భర్తను చూసానని చెబుతున్న పుష్పలత అత్తింటి వేధింపుల గురించి మాట్లాడారు.

రెండో బాబు పుట్టాక పిల్లలకు బాత్రూమ్ దగ్గర తిండి పెట్టడం, నాకు కుక్కకు వేసినట్లు అన్నం ప్లేట్ లోకి వేసి బాత్రూమ్ పక్కన కూర్చో పెట్టి పెట్టడం చేసే వారని, గొడవ పడి బయటకు వస్తే తల్లిదండ్రుల పరువు పోతుందని బిడ్డలకు తండ్రి ఉండడని భయపడి ఓర్చుకున్నాను. కానీ పిల్లల విషయంలో అలా ప్రవర్తించేసరికి ఉండలేక వచ్చేసానని అయితే నేను రెండో బాబును తీసుకు వచ్చేసానని మొదటి బాబు అక్కడే ఉండిపోయాడని వాడికి నేను కన్న తల్లిని అనే విషయం కూడా తెలుసో లేదో తెలియదంటూ ఎమోషనల్ అయ్యారు. మా అత్త బాగా శాడిస్ట్ నా మొదటి కొడుకును నాకు దూరం చేసింది అంటూ బాధపడ్డారు.
































