వెండితెరపై ఎన్నో సినిమాలు పలు పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీత చేసే రచ్చ మామూలుగా ఉండదు.. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో పలు డాన్సులు, తీన్మార్ స్టెప్పులతో కుర్రకారులను ఉర్రూతలూగిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేసే సురేఖవాణి తాజాగా తన కూతురు చేసే అల్లరికి సురేఖ వాణి చేసిన కామెంట్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

గతంలో టిక్ టాక్ ఉన్నన్ని రోజులు వీరిద్దరూ వివిధ రకాల డ్రస్సులతో వివిధ డాన్సులు ద్వారా అభిమానులను అలరింప చేశారు. సుప్రీతకు ఏకంగా హీరోయిన్ కి ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఉంది.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత అప్పుడప్పుడు అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన తండ్రితో తనకున్న అనుబంధం గురించి, తన తండ్రి మరణించిన కారణాల గురించి అభిమానులతో ముచ్చటిస్తూ ఎమోషనల్ అయ్యారు.అదే విధంగా తనకు జీవితంలో రాబోయే జీవిత భాగస్వామి ఏవిధంగా ఉండాలనే విషయాన్ని కూడా అభిమానులతో ముచ్చటించారు.ఇక తన తండ్రి మరణం తరువాత తన తల్లి సురేఖవాణి రెండవ పెళ్లి చేసుకోబోతుంది వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపించాయి.

ఈ క్రమంలోనే సుప్రీత, తన తల్లి సురేఖవాణి ఇటువంటి తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాంటి ఆరోపణలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలావుండగా సుప్రీత తనకెంతో ఇష్టమైన తన పెట్ డాగ్ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇక తాజాగా తన కూతురు నేలపై పడుకొని తన పెంపుడు కుక్కతో ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటుండగా అందుకు సురేఖవాణి ఏంటో ఈ పిచ్చి చేష్టలు అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here