తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అక్క,వదిన పాత్రల ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం తన కూతురు సుప్రీతో కలిసి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. తన భర్త సురేష్ తేజ మరణం తర్వాత తన కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్న సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేశారు.

ఈ క్రమంలోని తన కూతురితో ఒక స్నేహితురాలిగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా తన కూతురుతో పాటు వెళ్లడమే కాకుండా తన కూతురితో కలిసి గ్లామరస్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సురేఖవాణి, తన కూతురికి ఉందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ.. వీరు చేసే డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియాలో సురేఖవాణి షేర్ చేసే వీడియోలకు కూడా యమ క్రేజ్ ఉందని చెప్పవచ్చు.తాజాగా సురేఖవాణి తన కూతురుతో కలిసి చేసిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటికీ సురేఖ వాణి ఎనర్జీ విషయంలో ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా.. తన కూతురికి పోటీగా డాన్స్ చేస్తూ ఉన్నటువంటి ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరింకెందుకాలస్యం వీడియోపై మీరు ఓ లుక్కేయండి.































