Surya Daughter: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య వ్యక్తిగత జీవితానికి వస్తే 2006వ సంవత్సరంలో నటి జ్యోతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. వివాహం తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమై నిర్మాణ రంగంలో ఉంటూ కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే తాజాగా సూర్య కూతురు దియా ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసింది.

తాజాగా ఈమె పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. చిన్నతనం నుంచి చదువులలో ఎంతో ప్రతిభ కలిగి ఉన్నారు.ఇక తాజాగా సూర్య కూతురు దియా పదో తరగతి పూర్తి కావడంతో ఈమె పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈమె పరీక్ష ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సబ్జెక్టులోనూ దియా 95 శాతం మార్కులు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మురిసిపోతున్న సూర్య జ్యోతిక….
సబ్జెక్టు ప్రకారం చూసుకుంటే దియా తమిళంలో వందకు 95, ఇంగ్లీష్ 99, మ్యాథమెటిక్స్ 100, సైన్స్ 98, సోషల్ 97 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మొత్తం 500 మార్కులకుగాను 487 మార్కులు సాధించి మంచి ఉత్తీర్ణత సాధించారు. ఇలా ఈమె మంచి మార్కులు సాధించడంతో సూర్య జ్యోతిక తన కూతురు టాలెంట్ చూసి ఎంతో మురిసిపోతున్నారు. ఇక సూర్య అభిమానులు సైతం పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడమే కాకుండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

































