Sushant Singh Rajputh: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే ఈయన ముంబైలో తన ఫ్లాట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా సుశాంత్ మరణించడంతో ఒక్కసారిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్ కి గురైంది.

ఈ విధంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టారు అయితే అక్కడ ఈ కేసు విషయంలో అధిక ఒత్తిడి ఉన్న నేపథ్యంలో సుశాంత్ కేసును సిబిఐకి అప్పగించారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి డ్రగ్ మాఫియా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
ఇక ఈయన మరణించిన కొన్ని నెలల పాటు ఈ డ్రగ్ మాఫియా వెలుగులోకి రావడంతో ఎంతోమంది సినీ నటులు డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే సుశాంత్ మరణానికి గల కారణం ఏంటి అనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం లేదని చెప్పాలి. సుశాంత్ మరణించి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈయన మరణానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా.

Sushant Singh Rajputh: శరీరంపై గాయాలు ఉన్నాయి..
ఈ క్రమంలోనే సుశాంత్ మరణించిన తర్వాత ఆయన పార్తివదేహానికి పోస్టుమార్టం నిర్వహించినటువంటి
కూపర్ హాస్పిటల్ సిబ్బంది రూపకుమార్ షా తాజాగా సుశాంత్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈయన మార్చురీలో పనిచేసేవాడినని అయితే ప్రస్తుతం తాను రిటైర్డ్ అయ్యానని తెలిపారు.ఇక సుశాంత్ పోస్టుమార్టం నిర్వహించే సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని అయితే పోస్టుమార్టం చేసే సమయంలో సుశాంత్ ఒంటిపై గాయాలు ఉన్నాయని ఈయన తెలిపారు. ఎవరో తనని బలంగా కొట్టి చంపేశారని రూపకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతూ మరోసారి చర్చలకు కారణమయ్యాయి.































