Sushmita Sen: సుస్మితసేన్ మాజీ ప్రపంచ సుందరిగా బాలీవుడ్ తారగా అందరికీ ఎంతో సుపరిచితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి అగ్రతారగా పేరు సంపాదించుకున్న సుస్మితాసేన్ గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తున్నారు. ఇలా ఈమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె ప్రేమ వ్యవహారమే అని చెప్పాలి. సుస్మిత నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

ఈ విధంగా ఈమె పెళ్లి చేసుకోకుండా ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని వారి బాధ్యతలను తానే చూసుకుంటున్నారు. ఇకపోతే ఈమె పెళ్లి చేసుకోకపోయినా ఇప్పటివరకు తన కెరియర్లో ఏకంగా తొమ్మిది మందితో డేటింగ్ చేసిందని తాజాగా పదో వ్యక్తితో తన డేటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఈమె ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు స్వయంగా లలిత్ మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

ఇదిలా ఉండగా సుస్మితసేన్ కేవలం లలిత్ మోడీతోనే కాకుండా ఇదివరకే ఈమె ఏకంగా 9 మందితో డేటింగ్ చేసి వారితో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా ఈమె తనకన్నా వయసులో చిన్నవారితో కూడా డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పుకుంది. కేవలం సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా మోడల్స్ క్రికెటర్స్ బడా వ్యాపారవేత్తలతో ఈమె డేటింగ్ చేశారు.
పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సుస్మితాసేన్..
సుస్మిత సేన్ క్రికెటర్ వసీమ్ అక్రమ్, నటుడు రణ్‌దీప్ హుడా, డైరెక్టర్ విక్రమ్ భట్, ముద్దాసిర్, మానవ్ మీనన్ వంటి వారితో డేటింగ్ చేయడమే కాకుండా కొందరు బడా వ్యాపారవేత్తలు అయినా రితిక్ ఖాసిన్ చేసింది, సబీర్, సంజయ్ నారంగ్ వంటి వారితో డేటింగ్ చేసి చివరికి వారికి బ్రేకప్ చెప్పి ప్రస్తుతం లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్నారు.ఇప్పటికైనా ఈమె అతనితో జీవితకాలం కలిసి ఉంటారా లేకపోతే ఈమె డేటింగ్ చేసే వారి సంఖ్య మరింత పెరుగుతుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సుస్మితసేన్ నటిగా మోడల్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా అందరితో డేటింగ్ చేస్తూ అదే స్థాయిలో వార్తల్లో నిలిచారు.
































