మొదట్లో కరోనా లక్షణాలను చాలామంది గుర్తించలేకపోయారు. తర్వాత జలుబు, దగ్గు, తలనొప్పి ఉంటే దగ్గర్లోని పీహెచ్ సీకి వెళ్లి వైద్య పరీక్షలను చేసుకోవాలని వైద్యులు చెప్పారు. కానీ కరోనా వైరస్ రోజురోజుకు తన రూట్ ని మార్చుకుంటుంది. కేవలం పైన చెప్పిన లక్షణాలే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా కరోనా రావడానికి కారణం అవుతన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వినికిడి లోపం, వికారం, వాంతులు, చర్మంపై బొబ్బలు, చేతి, కాలి వేళ్లు రంగు మారడం వంటివి ఈ మధ్య కరోనా పేషెంట్లలో వైద్యులు గమనిస్తున్నారు. అంతే కాకుండా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, డైయేరియా, కండ్లకలక, తలనొప్పి, రుచి, వాసన కోల్పోవటం వంటివి కూడా సాధారణ లక్షణాలకుగా వైద్యులు చెబుతున్నారు.
కరోనా వివిధ రకాల వేరియంట్ల రూపంలో ఉంటే.. డెల్టా, లామ్డా వంటి వాటిల్లో రూపాంతరం చెందుతుంది. దీంతో ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పైన చెప్పిన లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనపడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సోకిన వాళ్ళకి నోరు ఆరిపోవడం కూడా కొత్త లక్షణంగా గుర్తించారు. అది మ్యూకస్ లైనింగ్ ఏర్పాటు చేస్తుంది. దీని కారణంగా ఇది ప్రొడ్యూస్ అవ్వదు. దీంతో నోరు ఆరిపోతూ ఉంటుంది.
గొంతు కూడా ఆరిపోయినట్లు ఉంటుంది. కాబట్టి కరోనా కి ఇవి కూడా కొత్త లక్షణంగా వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ చర్మం నీలిరంగులోకి మారిపోయినా.. మనిషి అసలు కదల్లేకపోతున్నా తప్పని సరిగా వైద్యుడిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యలు తెలిపారు. ఇలా.. ఏ లక్షణం ఉన్నా వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.




























