T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. గత టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే బయటకొచ్చిన టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది. కానీ టీమిండియా క్రికెటర్లు వరుసగా గాయాల పాలవుతుండటం ఫ్యాన్స్‌కు టెన్షన్ పెట్టిస్తోంది. ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడగా.. పెద్దగా గాయం కాకపోడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గాయడపటం అభిమానులను కలవరపెడుతోంది.

ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో సెమీ ఫైనల్‌కి సిద్దమవుతోన్న భారత ఆటగాళ్లు.. నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తోన్నారు. ఈ క్రమంలో నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోండగా.. విరాట్ కోహ్లీకి తీవ్ర గాయమైంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోహ్లీకి గాయమైంది. హర్షల్ పటేల్ వేగంగా వేసిన బంతి కోహ్లీకి గజ్జ ప్రాంతంలో తగిలింది. దీంతో తీవ్ర నొప్పితో కోహ్లీ కొద్దిసేపు బాగా ఇబ్బంది పడ్డాడు. కొద్దిసేపు మోకాళ్లపై కూర్చోని, ఆ తర్వాత మళ్లీ పైకి లేచి వార్మప్ చేశాడు. కానీ నొప్పి బాగా ఉండటంతో నెట్స్‌ను వదిలి బయటకు వెళ్లిపోయాడు.
విరాట్ కోహ్లీకి బాగా దెబ్బ తగిలిందని, గాయం తీవ్రంగానే ఉన్నట్లు చెబుతున్నారు. నేడు జరగనున్న రెండో సెమీ ఫైనల్‌కి ముందు కోహ్లీ గాయపడటం టీమిండియా శిబిరంలో టెన్షన్ రేపింది. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీకి గాయమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయం తీవ్రంగానే ఉందని, కోహ్లీ టీ 20 వరల్డ్ కప్‌కు దూరం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది.

T20 World Cup:
అయితే కోహ్లీకి గాయంకు సంబంధించి బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ రన్స్ చేస్తూ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.































