T20 World Cup: టి20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సెమీఫైనల్స్ అనంతరం ఫైనల్ జరుగునున్న నేపథ్యంలో ఫైనల్ లో ఏ ఏ జట్టు తల పడబోతున్నారు చివరికి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఇకపోతే ఇప్పటికే సెమీఫైనల్స్ లో చోటు సంపాదించుకున్న ఇండియా ఫైనల్ లో కూడా తలబడబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఫైనల్ లో టీమిండియా ఎవరితో పోటీ పడిపోతుంది ఎవరు కప్పు గెలుచుకుంటారనే విషయంపై సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నటువంటి ఈయన సచిన్ టెండూల్కర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాకుండా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఏబీ డివిలియర్స్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ ఫైనల్ లో టీమిండియాతో న్యూజిలాండ్ పోటీ పడిపోతుందని ఈయన తెలిపారు. ఇక ఫైనల్ లో టీమిండియా విజయం సాధిస్తుందని ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పటికే సెమీఫైనల్ లో చోటు సంపాదించుకున్న జట్ల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే మొదటి సెమీఫైనల్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పోటీ పడగా రెండవ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ టీమిండియా పోటీ పడిపోతుంది.

T20 World Cup: కప్ టీమిండియాదే…
ఏబీ డివిలియర్స్ ప్రకారం మొదటి సెమీఫైనల్స్ లో పాక్ పై న్యూజిలాండ్ విజయం సాధించగా రెండవ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధిస్తుందని, ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడగా చివరికి ఇండియా కప్ గెలుచుకుంటుందని తెలియజేశారు. ఈ విధంగా వరల్డ్ కప్ మ్యాచ్ ను ఉద్దేశిస్తూ ఏబీ డివిలియర్స్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన చెప్పినట్టుగానే ఫైనల్ లో టీమిండియా గెలిచి కప్పు సాధించాలనీ ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు.
































