Tag Archives: Congress party

Sharmila: కాంగ్రెస్ గూటికి చేరిన వైయస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ?

Sharmila: దివంగత రాజకీయ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ స్థాపించినటువంటి షర్మిల పెద్ద ఎత్తున తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అధికార ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అయితే తీరా ఎన్నికల సమయంలో ఈమె మౌనం వహించడమే కాకుండా ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నారు.

ఇకపోతే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ గత కొద్దిరోజుల క్రితం ఈమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినటువంటి షర్మిల అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు అయితే నేడు ఉదయం 10:55 నిమిషాలకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

ఈ క్రమంలోనే ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వైఎస్ షర్మిల దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడంతో తన తండ్రి గారు చాలా సంతోషపడతారని ఈమె వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది…

రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పదవి అప్పగించిన శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. ఇలా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పడంతో కొందరు వైయస్సార్ అభిమానులు ఈమె వ్యవహరి శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Balakrishna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన బాలయ్య… అంచలంచలుగా ఎదిగావంటూ ప్రశంసలు?

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తెలంగాణ ఎన్నికలలో ఫలితాలు విడుదలైన అనంతరం కాంగ్రెస్ పార్టీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం గురించి ఇప్పటికే చర్చలు జరిగి అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించారు.

ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియమితులు కావడంతో ఎంతో మంది అభిమానులు రాజకీయ నాయకులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను.

నమ్మకాన్ని వమ్ము చేయకుండా…

ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది.

Congress Party: తెలంగాణ కాంగ్రెస్ సీఎం పదవి కంటే ఆ పదవికే పోటీపడుతున్న నేతలు?

Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి నిన్నటి వరకు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపించింది దీంతో కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీ పెద్దలను కలిసి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యారు దీనిని అధికారకంగా కూడా ప్రకటించారు.

ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు తాపత్రయపడిన రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించడంతో డిప్యూటీ సీఎం అన్న అవుదామని ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవికి అత్యధికంగా డిమాండ్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవి రేసులో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కతో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ డిప్యూటీ సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్నారు.

తనకు కీలకమైన పోర్ట్ ఫోలియోతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో కూడా పలువురు డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది.సీతక్కకు మంత్రి పదవి ఖాయమైనప్పటికీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను అధికంగా గెలుచుకున్నందుకు తమ వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని ఆదివాసి ఎమ్మెల్యేలు అధిక ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

సీతక్క పట్ల సానుకూలం..

ఇక సీతక్కకు మంత్రి పదవి ఇప్పటికే కారారు అయినప్పటికీ ఆమెకు డిప్యూటీ పదవి కూడా కట్ట పెట్టాలన్న ఆలోచనలు ఉన్నారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సీతక్క పట్ల సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ముఖ్యమంత్రి పదవికి కాకుండా డిప్యూటీ సీఎం పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు మరి ఈ పదవి ఎవరిని వరిస్తుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్న విషయాలు త్వరలోనే తెలియని ఉన్నాయి.

Krishnam Raju: సినిమాలలో రాణిస్తూ కేంద్ర మంత్రిగా సక్సెస్ అయిన కృష్ణంరాజు!

Krishnam Raju: టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యల కారణంగా నేడు తుది విశ్వాస విడిచారు.అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణంరాజు నేడు తెల్లవారుజామున కన్నుమూశారు.

ఇకపోతే ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తన మార్క్ చూపించారు. రాజకీయాలలోకి వచ్చి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకుందాం. కృష్ణంరాజు 1991 వ సంవత్సరంలో రాజకీయాలలోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన అదే ఏడాది నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతి రాజు విజయ్ కుమార్ రాజు అనే వ్యక్తి పై పోటీ చేసి ఓడిపోయారు.

ఈ విధంగా ఓడిపోవడంతో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి 1998లో బిజెపి పార్టీలో చేరారు. కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీకి దిగి విజయం సాధించారు.1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేసి… కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు.

Krishnam Raju: మంచిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణంరాజు..

అనంతరం ఈయన అటల్ బీహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక కొంతకాలం పాటు రాజకీయాలకు దూరమైనటువంటి ఈయన 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. అయితే ఈ పార్టీ కూడా గెలవకపోవడంతో ఈయన తిరిగి బీజేపీలో చేరారు. ఇలా బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేదు.

Rashmika: రాజకీయాలలోకి రానున్న రష్మిక.. వైరల్ అవుతున్న వేణు స్వామి కామెంట్స్?

Rashmika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి రష్మిక ఒకరు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే నటి రష్మిక గురించి గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. రష్మిక స్టార్ నటిగా కొనసాగడం కోసం తన ఇంట్లో పూజలు చేయించుకున్నారు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే తాజాగా మరోసారి రష్మిక గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి నటి రష్మిక కెరియర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక త్వరలోనే కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నారు అంటూ ఈయన ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Rashmika: సినీ ఇండస్ట్రీకి దూరమవుతారా…

ఈ విధంగా ఈయన రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసిన నెటిజన్స్ కొంచెం స్టార్ డమ్ వస్తేనే రాజకీయాలలోకి రావడం ఏంటి ఇలా రాజకీయాలలోకి వస్తే రష్మిక కెరియర్ పూర్తిగా దెబ్బతింటుంది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి వేణు స్వామి చెప్పిన విధంగానే రష్మిక రాజకీయాలలోకి వచ్చి సినీ కెరియర్ నాశనం చేసుకుంటుందా లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Congress 137th Foundation Day : సోనియా చేతిలో ఊడి పడిపోయిన కాంగ్రెస్ జెండా..! చివరకు జెండా ఎగురవేయకుండానే.. [Video]

కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవాలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధి కూడా పాల్గొన్నారు. ఈ నేపద్యంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేందుకు సిద్దమయ్యారు. అయితే జెండా ఎగురవేసే క్రమంలో సిబ్బంది అప్పటికే కట్టి ఉంచిన తాడును లాగుతున్నారు సోనియా గాంధి. అది కాస్త చిక్కుకు పోవడంతో.. పక్కనే ఉన్న సిబ్బంది ఆమె చేతిలో నుంచి తాడును తీసుకుని గట్టిగా లాగడంతో ఒక్కసారిగా పార్టీ జెండా ఊడి కింద పడిపోయింది.

congress flag falls off : సోనియా చేతిలో ఊడి పడిపోయిన కాంగ్రెస్ జెండా..! చివరకు జెండా ఎగురవేయకుండానే.. [Video]

జరిగిన ఈ పరిణామంతో సోనియాతో సహా అక్కడున్న నేతలంతా అవాక్కయారు. అయితే ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో మహిళా కార్యకర్త పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన జెండాను తిరిగి పెట్టె ప్రయత్నం చేసారు.. కానీ అది కుదరకపోవడంతో జెండాను ఎగురవేయకుండానే కార్యక్రమం కొనసాగించారు.

“రేప్ తప్పదన్నప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి..” అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. “రేప్ తప్పదన్నప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి” అంటూ ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వరదల నష్టం గురించి చర్చ జరగాలని కర్నాటక అసెంబ్లీ లో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఎమ్మెల్యేలను ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో స్పీకర్ మాట్లాడుతూ “నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నిటినీ ఆస్వాదిస్తూ అవును, అవును అంటూ ఉండాలి” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ “రేప్ తప్పనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి. మీరిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా వ్యఖ్యానించడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు సామాన్యులు.

కపిల్ సిబల్ వైఖరిపై గుర్రుగా ఉన్న హైకమాండ్..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కపిల్ సిబల్ వైఖరిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కపిల్ సిబల్​ తన నివాసంలో ప్రతిపక్ష నేతలకు సోమవారం రాత్రి విందు ఇవ్వడం వెనకున్న మర్మం ఏమిటన్నది తెలియక పార్టీ నేతలు సందిగ్ధంలో పడిపోయారు. ఇందుకు కారణం లేకపోలేదు.తన శక్తి సామర్థ్యాలేంటో కాంగ్రెస్ అదిష్ఠానానికి తెలియజేసేందుకే సిబల్ ఈ భేటీ నిర్వహించినట్లు సన్నిహిత వర్గాల అంటుంటే.. గాంధీ లు లేకుండా విందు నిర్వహించడం ఏమిటని సిబల్ వ్యతిరేక వర్గం మండిపడుతోంది.

కాగా కపిల్​ సిబల్ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నమైన ప్రకటన విడుదల చేసింది. ఇది ఆయన వ్యక్తిగత విందు సమావేశం అని, రాజకీయాలతో సంబంధం లేదని తెలిపింది. మరోవైపు ప్రతిపక్షాలతో విందు పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.