Tag Archives: dasari narayana rao

Actress Jayapradha: జయప్రదను బికినీ వేసుకోమని బలవంత పెట్టిన డైరెక్టర్… డైరెక్టర్ అలా చెప్పేసరికి బోరున ఏడ్చిన నటి?

Actress Jayapradha: సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పటికప్పుడు కాలానికి అనుకూలంగా అప్డేట్ అవుతూనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం. లేదంటే ఇండస్ట్రీలో అవకాశాలు రావనే చెప్పాలి. ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు పాత్రలకు అనుగుణంగా ప్రస్తుతం గ్లామర్ షోలు చేస్తూ నటిస్తున్నారు.ఇలా స్కిన్ షో చేయకపోతే అసలు వారి హీరోయిన్లే కాదు అని అందరూ అభిప్రాయపడతారు.

కానీ గతంలో అలా కాదు హీరోయిన్ అంటే నిండుగా సాంప్రదాయమైన దుస్తులు ధరించి నటించేవారు.పాత్ర డిమాండ్ చేస్తే తప్ప వాళ్ళు గ్లామర్ పాత్రలలో నటించేవారు కాదు. ఇక బికినీ అంటే ఆమడ దూరం ఉండేవాళ్లు.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా ఎంతో పద్ధతిగా నటించి అందరిని సందడి చేసిన నటి జయప్రద గురించి పరిచయం అవసరం లేదు.

అయితే ఈమె నటించిన దేవుడే దిగివస్తే అనే సినిమా కోసం బికినీ వేసుకోవాల్సి వచ్చిందని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు షూటింగ్ లొకేషన్లోకి వెళ్లగానే తనని డ్రస్ చేంజ్ చేసుకుని రమ్మని చెప్పారు. అయితే అక్కడికి వెళ్లేసరికి బికినీ చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే డైరెక్టర్ గారి వద్దకు వచ్చి బికినీ ఉందని చెప్పగా బికినీ వేసుకొని రమ్మని చెప్పారు.

Actress Jayapradha: జీవితంలో అలాంటి దుస్తులు వేయకూడదనుకున్నా..

నేను వేసుకోనని ఎంత చెప్పినా డైరెక్టర్ గారు మాత్రం ఏం పర్వాలేదు, వెళ్లి బికినీ వేసుకొని రా అంటూ తనని బలవంతం చేశారని ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక బాగా ఏడ్చానని జయప్రద తెలిపారు. ఇకపోతే తప్పని పరిస్థితులలో తాను బికినీ వేసుకొని వచ్చానని కేవలం బికినీలో స్విమ్మింగ్ పూల్ లోకి దూకే సన్నివేశాన్ని చిత్రీకరించారని జయప్రద వెల్లడించారు.ఇక దాని తర్వాత జీవితంలో తాను ఎప్పుడు బికినీ ధరించకూడదని నిర్ణయం తీసుకున్నానని ఈ సందర్భంగా ఈమె గతంలో జరిగిన సన్నివేశం గురించి వెల్లడించారు.

Dhavala Satyam : ఆ విషయంలో నాకు దాసరి కి మధ్య పెద్ద గొడవ జరిగింది.. నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

Dhavala Satyam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎన్నో వందల సినిమాలకు పనిచేసి ఇండస్ట్రీ పెద్దగా గుర్తింపు పొందిన దాసరి నారాయణరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈయన స్నేహితుడిగా శిష్యుడిగా ధవళ సత్యం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధవళ సత్యం ఇండస్ట్రీలో తనకు దాసరి గారికి మధ్య జరిగిన గొడవ గురించి వెల్లడించారు.

Dasari Narayana Rao: ఆ విషయంలో నాకు దాసరి కి మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

తాను రామాపురంలో సీత అనే సినిమా షూటింగ్ చిత్తూరులో చేస్తున్నాను. అక్కడ కొందరు యూనియన్ లీడర్స్ వచ్చి ఇక్కడ కార్డులు ఉన్న వారు ఒక వైపు రండి లేని వారు ఒక వైపు రండి అంటూ పెద్ద ఎత్తున గొడవ చేశారు. నాకు సినిమా షూటింగ్ సమయంలో మధ్యలో ఎవరైనా ఇలా పనికి అడ్డు పడితే చాలా కోపం వస్తుంది. ఇలా యూనియన్ లీడర్స్ సినిమా షూటింగ్ మధ్యలో ఇలా చేయడంతో నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.

Dasari Narayana Rao: ఆ విషయంలో నాకు దాసరి కి మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.. ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

చిత్తూరు డిఎస్పీ గారు వచ్చి నాతో మాట్లాడారు మరి వీరిపై కేసు పెడతారా అంటే పెడతాను అని చెప్పాను. అలా వారిపై కేసు పెట్టడంతో యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకెళ్లి జైలులో పెట్టారు. ఈ విధంగా యూనియన్ అనే విషపురుగు కారణంగా మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అయితే అప్పట్లో యూనియన్ ప్రెసిడెంట్ గా దాసరిగారు ఉండేవారు. విషయం తెలియగానే ఆయన ఫోన్ చేసి ఒక్క క్షణంలో వాళ్ళందరూ బయట ఉండాలి అని చెప్పారు.

మా ఇద్దరి జర్నీలో ఇదొక పెద్ద మచ్చ…

వాళ్లు నా సినిమాని డిస్టర్బ్ చేశారు.. అందుకే ఇలా చేశాను అని నేను ఆయనతో చెప్పాను. వాళ్లు యూనియన్ లీడర్స్.. వాళ్లు ఏమైనా చేస్తారు ముందు వాళ్లు బయటకు రావాలి అన్నారు.ఆ విషయంలో నేను వినకపోయేసరికి నువ్వంటున్నది ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకో ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా మా ఇద్దరి జర్నీలో మాకు ఇది ఒక పెద్ద మచ్చగా ఏర్పడిందని ధవళ సత్యం దాసరితో తనకు జరిగిన గొడవ గురించి తెలిపారు.

Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!

Dasari Narayana Rao:తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈయన దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీ బరువు బాధ్యతలను కూడా తన భుజాలపై మోశారు. దాసరిగారు డైరెక్టర్ ధవళ సత్యం ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో దాసరి సహాయంతో ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!

అప్పటికే దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. ఇక ఇండస్ట్రీలో దాసరి గారి దగ్గర అలా మెలగాలి ఇలా మెలగాలి అంటూ చాలా మంది చాలా కండిషన్స్ పెట్టారు. అయితే అది నచ్చక ఇండస్ట్రీ నుంచి వెనక్కి వచ్చేద్దామని భావించాను. కానీ గురువు గారి ప్రోత్సాహంతో తాను ఇండస్ట్రీలో కొనసాగానని ధవళ సత్యం తెలిపారు. ఇద్దరం స్నేహితులమే అయినప్పటికీ తనని ఎప్పుడు గురువుగానే భావిస్తూ అన్నయ్య అంటూ పిలుస్తానని ధవళ సత్యం తెలిపారు.

Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!

ఇండస్ట్రీలో వీరిద్దరి అనుబంధం గురించి చెబుతూ దాసరి చివరి క్షణాలు గురించి కూడా ఈ సందర్భంగా దవళ సత్యం తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. దాసరి గారితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఆయన చనిపోయే ముందు తన పక్కన ధవళ సత్యం అనే వాడు ఉండాలని కోరుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యారు.

నాతో పాటు ఉండరా…అన్నారు

దాసరి గారి చివరి రోజులలో తన పక్కన ఉండాలని పిలిపించడంతో నేను, రామకృష్ణ, రేలంగి నరసింహారావు ముగ్గరం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వెళితే దాదాపు ఎనిమిది గంటల వరకు ఆయనతో కలిసి మాట్లాడుతూ ఆయనతోనే సమయం గడిపాము. ఒక రోజు కాస్త ఆలస్యంగా వెళితే నాతోపాటు ఉండరా.. అని అడగగా ఉంటాను అన్నయ్య అంటూ తన చేతిని ఇలా పట్టుకున్నాను. తాను కూడా నా చేతిని అలా పట్టుకొని స్ట్రేక్చర్ పై లోపలికి వెళ్ళాడు. ఇక తిరిగి రాలేదు. ఆయన అడిగాడని నేను ఉన్నాను,కానీ ఆయన తిరిగి రాలేదు అంటూ ఈ సందర్భంగా దాసరి గారి గురించి ధవళ సత్యం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Jagan Movie: ఏపీ సీఎం జగన్ పేరుతో సినిమా ఉందని మీకు తెలుసా?

Jagan Movie: జగన్ అంటేనే టక్కున అందరికీ ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు. అయితే జగన్ పేరు మీదగా ఓ సినిమా కూడా ఉందండోయ్.. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియదు. అప్పట్లో శోభన్ బాబు హీరోగా ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను సందడి చేసింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే 1972లో వచ్చిన మానవుడు దానవుడు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించారు. ఇందులో శోభన్ బాబు జగన్ అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో చాలామంది తమ పిల్లలకు జగన్ అనే పేరు కూడా పెట్టారు.

ఇక జగన్ పాత్రకు వచ్చిన ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకొని దాసరి నారాయణరావు రాజకీయాల నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు. ప్రస్తుతం, మాజీ ముఖ్యమంత్రుల మధ్య డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి జగన్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.

అభ్యంతరం తెలిపిన సెన్సార్…


ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సెన్సార్ వెళ్ళినప్పుడు సినిమాకు అభ్యంతరం వచ్చింది. ఇందులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు సన్నివేశాలు ఉండటం చేత సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వెలువడ్డాయి. అయితే దాసరి సినిమాలకు ఇలాంటి అభ్యంతరాలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే దాసరి రివిజన్ కోసం ప్రింట్ ముంబైకు వెళ్ళింది. అక్కడ పలు సమస్యలు ఎదురైనా, అనంతరం ఈ సినిమా అనుకున్న తేదీ కన్నా మరికొద్ది రోజులు విడుదలకు వాయిదా పడింది. అలా ఈ సినిమా 1984 మార్చి 10 వ తేదీ విడుదల అయింది. ఇలా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించలేకపోయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం శోభన్ బాబు జగన్ సినిమాపై పడింది.

Dasari Narayana Rao: చిరు, బాలయ్య, రాజశేఖర్ లకు అలాంటి ట్యాగ్స్ ఇచ్చిన దాసరి.. అవి ఏంటంటే?

Dasari Narayana Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు పాత్ర ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా నిర్మాతగా నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సినీ పెద్దగా చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సేవలను అందించారు.

Dasari Narayana Rao: చిరు, బాలయ్య, రాజశేఖర్ లకు అలాంటి ట్యాగ్స్ ఇచ్చిన దాసరి.. అవి ఏంటంటే?

ఇప్పటివరకు చలన చిత్ర పరిశ్రమలో ఏ దర్శకుడు సృష్టించని రికార్డులను దాసరి తన సొంతం చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి 15 చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకొని రికార్డును సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ దర్శకుడు కూడా చేదించకపోవడం గమనార్హం.

Dasari Narayana Rao: చిరు, బాలయ్య, రాజశేఖర్ లకు అలాంటి ట్యాగ్స్ ఇచ్చిన దాసరి.. అవి ఏంటంటే?

ఈ క్రమంలోనే దాసరి దర్శకత్వంలో 1992లో సూరిగాడు అనే అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విజయవంతమైన తర్వాత దాసరి నారాయణరావు అప్పట్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ,రాజశేఖర్, మోహన్ బాబు గురించి మాట్లాడుతూ వారికంటూ ఒక ప్రత్యేకమైన ట్యాగ్స్ ఇచ్చారు. మరి దాసరి ఏ హీరోలకు ఎలాంటి ట్యాగ్స్ ఇచ్చారు అనే విషయానికి వస్తే…

నందమూరి బాలకృష్ణ:

దాసరి బాలయ్య గురించి మాట్లాడుతూ బాలకృష్ణ అందమైన నటుడు అంటూ ట్యాగ్ ఇచ్చారు.రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ఏదైనా కొత్త పాత్రలలో చేయాలంటే రాజశేఖర్ అయితే బాగుంటుంది. అలా చేయడం అతనికే సాధ్యం అంటూ రాజశేఖర్ గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఈయన ఓ స్టార్ హీరో అంటూ దాసరి చిరుకి ట్యాగ్ ఇచ్చారు. ఇక నాగార్జున గురించి మాట్లాడుతూ నాగార్జున ఒక తెలివైన నటుడు, ఇక తన శిష్యుడు మోహన్ బాబు గురించి మాట్లాడుతూ మోహన్ బాబు ఒక గ్రేట్ ఆర్టిస్ట్.. హీరో కన్నా గొప్ప నటుడు అంటూ మోహన్ బాబుకు ట్యాగ్ ఇచ్చారు.

ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ చిన్న తప్పే దాసరి మరణానికి కారణమయ్యింది : రేలంగి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, నిర్మించిన దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నటించారు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.

దాసరి సినీ జీవితం విషయానికి వస్తే ఎంతో మంది నటీ నటులను దర్శకులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి సినీ పెద్దగా, గురువు, మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈ క్రమంలోనే దాసరి నారాయణరావు దగ్గర శిష్యరికం పొందిన డైరెక్టర్ రేలంగి నరసింహారావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఆయన తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ తన గురువు గారు దాసరి మరణానికి కారణం తాను చేసిన చిన్న తప్పు అనే విషయాన్ని వెల్లడించారు. దాసరి నారాయణ రావు గారు అధిక శరీర బరువు కావడం వల్ల శరీర బరువు తగ్గించుకోవడం కోసం సర్జరీ కాకుండా బెలూన్ వేయించుకున్నారు. అయితే 6 నెలల తర్వాత ఆ బెలూన్ తీసివేయించి అదే సమయంలో ఎవరికీ తెలియకుండా మరోసారి బెలూన్ వేయించుకున్నారు.

అయితే రెండోసారి బెలూన్ వేసే సమయంలో సీనియర్ డాక్టర్లు లేకపోవటంవల్ల జూనియర్ డాక్టర్లు బెలూన్ వేసే సమయంలో బెలూన్ పంక్చర్ కావడంతో అది కాస్త ఇన్ఫెక్షన్ అయింది. ఇలా ఆ ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడని ఈ సందర్భంగా దర్శకుడు రేలంగి నరసింహారావు దాసరి మరణం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

సిగ్గు పడాల్సింది వాడు.. నేను కాదు.. పూనమ్ కౌర్ ఉద్దేశ్యం ఏమిటి..?

ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరు వాదన ప్రతి వాదనలతో హీటెక్కిపోతోంది. పోసాని కృష్ణమురళి రెండు సార్లు విలేకరుల సమావేశం నిర్వహించి ఓ రేంజ్ లో పవన్ పై విరుచుకుపడ్డాడు. దీనిపై అతడి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్న పోసాని.. అందులో ఓ నటి గురించి ప్రస్తావన తెచ్చాడు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ ఓ అంశాన్ని లేవనెత్తారు.

ఇది కూడా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ప్రముఖ సినీ పరిశ్రమలోని పేరున్న ఓ వ్యక్తి ఆ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై అబర్షర్ చేయించాడని అతడు విమర్శలు చేశాడు. దమ్ముంటే అమ్మాయికి న్యాయం చేయాలని పవన్ కు సవాల్ విసిరాడు. ఆ అమ్మాయి పూనమ్ కౌర్ అంటూ.. ఆ అమ్మాయినే పరోక్షంగా అన్నాడనే వార్తలు వినిపించాయి.

దీంతో అప్పటి నుంచి పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నటి కూడా ఆ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. సీని పరిశ్రమలో తనకు గురు అంటే ఒక్కరే అని.. అది కూడా దాసరి గారు అంటూ అన్నారు. ఈ రోజు దాసరి నారాయణ రావు ఉన్నట్టు.. ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది అంటూ .. మిస్ యూ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

అందులో ఏముందంటే.. ‘తాను రేప్ కు గురయ్యాను.. కానీ సమాజం తనను ఒక విధంగా చూస్తుంది.. శీలం పోయింది.. సిగ్గు పోయిందని అంటున్నారు.. కానీ తప్పు చేసింది వాడు.. వాడు సిగ్గుపడాలి.. నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఆ మహిళ ఆ వీడియోలో చెబుతుంది. ఈ మాటలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి. దీనిని చూసిన అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడో వచ్చిన ఈ వీడియో పూనమ్ షేర్ చేశారు. ఆమె ఈ వీడియో షేర్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.

ఏఎన్నార్ తో దాసరి నారాయణరావుకు ఆ విషయంలో మనస్పర్థలు వచ్చాయి..!

దివంగత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఏదో ఒక విభిన్నమైన కథాంశం ఉంటుంది. అతడి దర్శకత్వంలోనే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు ఎంతో మంది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అతడు ఒక సినీ శిఖరం. ప్రతీ ఒక్కరు దాసరి నారాయణరావును గురువుగా పేర్కొంటారు. అంతలా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో అతి సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. సినిమాలపై ఎంతో ఆసక్తితో మద్రాసు చేరుకొని అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అతడు ఇంతలా సినీ రంగంలో పేరు తెచ్చుకోవడానికి గల కారణం అక్కినేని నాగేశ్వరావు మరియు సావిత్రి గారు అని అతడు ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు కూడా.

అంతలా ఏఎన్నార్ ను ఆదిరించిన దాసరి అతడితోనే విభేదాలు వచ్చాయట. రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు కాస్త తారా స్థాయికి చేరుకొని.. ఇద్దరు ఒకరంటే ఒకరు.. మాట్లాడుకోకుండా ఉండేవారట. ఇదంతా దాసరి నారాయణరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విషయంలో ఇలా మేము దూరం అవుతామని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.

ఏఎన్నార్ తో సమానంగా దాసరికి కూడా రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో నాగేశ్వరావు అన్నఒక మాటకు అతడు బాగా బాధపడ్డట్లు చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత వాళ్ల కుటుంబంతో దాసరి కుటుంబానికి ఎలాంటి మనస్సర్థలు రాలేదన్నారు. తర్వాత దాసరి నారాయణ రావు అక్కినేని నాగార్జునతో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

దాసరి నారాయణ వల్ల అతడు రూ.100 కోట్లు నష్టపోయారు..! ఎందుకు.. ఎవరు..?

దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. అంతే కాదు మేస్త్రీగా రాజకీయాల్లోకెళ్లి ఇస్త్రీ చేసిన దర్శక నట దిగ్గజం దాసరి నారాయణ రావు. దాసరి అనేది పేరు కాదు…ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు.

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఎంతో మంది సినీ హీరోలను, హీరోయిన్లను, ఆర్టిస్టులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసి.. మంచి బంగారు భవిష్యత్తును ఇచ్చిన మహోన్నత వ్యక్తి. ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా, యాక్టర్ గా , గాయకుడిగా ఎన్నో సనిమాలను తీశారు.. నటించారు. అబ్బో ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా అతడు సినిమాలకు పరిచయం చేసిన వారిలో ఓ వ్యక్తి రూ.100 కోట్లు దాసరి వల్ల నష్టపోయాడట.. ఎవరా వ్యక్తి.. ఇది నిజమేనా.. ఆ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

1995 సంవత్సరంలో ‘ఒరేయ్ రిక్షా’ సినిమా దాసరి దర్వకత్వంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దాసరి నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని.. యాక్టింగ్ లో కూడా ఎంతో ప్రతిభ ఉన్న వారిగా అందరికీ తెలిసింది. అయితే జయప్రకాశ్ రెడ్డి.. దాసరికి మంచి స్నేహితుడు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాలను చెప్పారు. అప్పట్లో జేపీ రెడ్డి సినిమాలోకి రాకముందు దాసరి నారాయణ బలవంతగా వచ్చేట్టు చేశారట.

అప్పుడు అతడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అప్పుడు అతడికి ఓ ప్రాజెక్టు వచ్చింది. దానిని చేస్తున్న సమయంలో దాసరి బలవంతం చేయడంతో ఇండస్ట్రీకి వచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టు వదిలి పెట్టి రావాల్సి వచ్చిందని.. ఆ ప్రాజెక్టు విజయవంతగా పూర్తి చేసిన వారికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఇలా దాసరి వల్ల తాను వంద కోట్ల రూపాయాలు నష్టపోయానని నవ్వుకుంటూ చెప్పారు జయప్రకాశ్ రెడ్డి.

ఒకప్పుడు ఈ రెండు రిక్షాలు ఢీ కొన్నాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ పగిలిపోయింది.

ఈ నటులు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించారు. కొన్ని సంవత్సరాల తేడాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయాలను అందుకుంటే మరొకరు దాసరి దర్శకత్వంలో తెరపై కనిపించారు. ప్రాణం ఖరీదు, కోతలరాయుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించగా, నారాయణమూర్తి సపోర్టింగ్ క్యారెక్టర్ లో చిరంజీవి పక్కన కనిపించారు.

చిరంజీవి సోలో హీరోగా ఎదుగుతూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1980 ప్రథమార్థంలో నారాయణమూర్తి స్నేహాచిత్ర బ్యానర్ స్థాపించి, హీరోగా నటిస్తూనే నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే 1995 వచ్చేసరికి చిరంజీవి, నారాయణ మూర్తి ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. దాసరి చిత్రాల్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నారాయణమూర్తిని హీరోగా పెట్టి ఏకంగా ఓ సినిమానే మొదలు పెట్టడం జరిగింది.

దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “ఒరేయ్ రిక్షా” చిత్రంలో ఆర్.నారాయణమూర్తి, రవళి హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో నారాయణమూర్తి కష్టపడి రిక్షానడుపుతూ.. తన గారాబాల చెల్లిని పెంచి పోషించే ఒక అన్నగా ఆర్.నారాయణమూర్తి నటించారు. 1995 నవంబర్ 9న ఒరేయ్ రిక్షా సినిమా విడుదలై బాక్సాఫీసు బరిలో సిద్ధంగా ఉంది.

ఇదే సంవత్సరంలో క్రాంతి కుమార్ నిర్మాణం కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రిక్షావోడు” చిత్రంలో చిరంజీవి, నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. కోడిరామకృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం, గూడచారి నెం1, సింహపురిసింహం లాంటి చిత్రాలు వచ్చాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 1995 డిసెంబర్ 14న “రిక్షావోడు” చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచింది. ఈ రెండు చిత్రాలు రిక్షా అనే టైటిల్ తో వచ్చి బాక్సాఫీస్ బరిలో ఉండటం ప్రేక్షకులతో సహా సినీ పరిశ్రమ తీవ్ర ఉత్కంఠతో గమనించింది. బ్లాక్ బస్టర్ లాంటి చిత్రాలతో మోత మోగించిన మెగాస్టార్ ఈ సంవత్సరం ఊహించని విధంగా కొంత చతికిల పడ్డారు. ఆయన‌ నటించిన “రిక్షావోడు” చిత్రాన్ని వెనక్కు నెట్టి నారాయణమూర్తి తన రిక్షాను ముందుకు నడిపించి, బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించాడు.