సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా షూటింగ్ అనంతరం తరువాత మలయాళ రీమేక్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్ ప్లే డైలాగులు చెప్పగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానాతో తెర పంచుకొనున్నారు. ఇందులో పవర్ స్టార్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. నేటి తరం యువత కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పాటలను కూడా ఎంతో ఆదరిస్తున్నారు.
ఈ క్రమంలోని సినిమాలలోని పాటలను ఎంతో జాగ్రత్తగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేలా సంగీత దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాకు సంగీత స్వరాలను ఎస్.ఎస్.తమన్ సమకూరుస్తున్నారు. అలా వైకుంఠపురం సినిమాలో తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అదే స్థాయిలో పవన్ సినిమా చేయాలనే ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫోక్ సాంగ్ కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన పెంచల్‌దాస్ ఈ పాటను ఆలపించనున్నారు.సెకండ్ హాఫ్ లో ఈ పాట వస్తుందని ఈ పాటను ఎంతో అద్భుతంగా చేయాలని తమన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

































