Tamannah: హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్న ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. తెలుగు, తమిళ్, హింది భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు నార్త్ లోనే సెటిల్ అయ్యింది.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా తమన్నా ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో గత కొంతకాలంగా తమన్నా ప్రేమాయణం నడుపుతోంది.
ఇలా వీరిద్దరు కలిసి గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ప్రియుడిని ముద్దులతో ముంచెతింది. అంతే కాకుండా తరచూ ఇద్దరు జంటగా కనిపించడంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరూ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తూ తమ మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని కప్పిపుచ్చుతున్నారు. ఇలా ఇద్దరి మధ్య రిలేషన్ గురించి వార్తలు వినిపిస్తున్న తరుణంలో వారి ప్రేమను అంగీకరించకపోగా.. ఒకరికొకరు దూరంగా కూడా ఉండలేకపోతున్నారు. తాజాగా తమన్నా ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Tamannah: మరోసారి జంటగా కనబడిన తమన్నా విజయ్ వర్మ..
తాజాగా వీరిద్దరూ ముంబైలోని ఒక హోటల్ కి డిన్నర్ డేట్ కి వెళ్లి తిరిగి వెళ్ళటానికి ఇద్దరు కలిసి ఒకే కారులో బయలుదేరిన సమయంలో ఫొటోగ్రాఫర్లు ఫోటో
క్లిక్ మనిపించారు. అయితే గతంలో లాగా ఈ జంట మొఖాలు దాచుకోకుండా హాయ్ చెబుతూ అక్కడినుండి వెళ్ళిపోయారు. అయితే వీరిమధ్య నిజంగా స్నేహ బంధం మాత్రమే ఉందా లేక ఇద్దరూ రిలేషన్ లో ఉండి వారి బంధం గురించి బయట పెట్టకుండా సీక్రెట్ గా మైంటైన్ చేయాలని చూస్తున్నారో తెలియదు మరి.































