Connect with us

Political News

కోవిడ్ పై పోరాటానికి తమిళనాడు బీజేపీ కొత్త అస్త్రం!

Published

on

కోవిడ్ థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు బిజెపి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సహాయపడేందుకు 26,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు.

Advertisement

కాగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన డీఎంకే వంటి పార్టీలు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

Advertisement

Featured

Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?

Published

on

Tirupathi Laddu:తిరుమల తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగింది అంటూ ఎప్పుడైతే కూటమినేతలో ఆరోపణలు చేశారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేసుకొని హిందూయిజాన్ని కాపాడతానని సనాతన ధర్మం కోసం ప్రాణాలను కూడా వదులుకోవడానికి సిద్ధమే అంటూ కామెంట్లు చేశారు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనే విధంగా వివాదం నడుస్తుంది. ఇక ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు విచారణలో వెలువడిన అంశాల గురించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..దేవుడ్ని రాజకీయాల్లోకి లాగకండి జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్ పెట్టారు. దీనికి తోడుగా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలకు సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలను..లేవనెత్తిన అంశాలను కూడా పెట్టి మరీ ఇద్దరిపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

పవన్ లౌకికవాది..
ఈ విధంగా ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు తన కుమార్తె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా 50 రోజుల వేడుకలో భాగంగా ఈయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ లౌకీక వాది అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు. దీంతో కొందరు నాగబాబుకు సపోర్ట్ చేయగా మరికొందరు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!

Published

on

Chandra Babu: తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని నిజమైతే సాక్షాలు బయట పెట్టాలి అంటూ సుప్రీంకోర్టు విచారణలో ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై మండిపడిన సంగతి తెలిసిందే. హిందువులకు పవిత్ర ఆలయం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా పంపిణీ చేసే లడ్డులో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేశారు.

Advertisement

ఈ ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది తెలియక ముందే పెద్ద ఎత్తున కూటమి నేతలు చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించింది.

తిరుపతి లడ్డు పై ఆరోపణలు చేయడం కాదని సాక్ష్యాలు బయట పెట్టాలని కోర్టు ఆదేశాలను జారీచేసింది. ఇలా కోర్ట్ విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడుకు షాక్ తగలడంతో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఈయన పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బాబు చేసిన తప్పుడు వ్యాఖ్యల కారణంగా ఎంతో మంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

క్షమాపణలు చెప్పాల్సిందే..
ఇలా ఈయన చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. CBN should apilogize Hindus అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ బాబు హిందువులకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా

Published

on

Roja: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగింది అంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది అయితే ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విచారణలో భాగంగా కూటమి ప్రభుత్వానికి మొట్టిక్కాయలు వేసిన సంగతి తెలిసిందే. కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేవని ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండిపడింది..

Advertisement

ఇలా లడ్డులో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడంతో సాక్షాలు బయటపెట్టాలని కోర్టు ఆదేశాలను జారీ చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇలా చేశారని వైకాపా నాయకులు మండిపడుతున్నారు. ఇక కోర్టు విచారణ అనంతరం ఈ విషయం పై సినీ నటి మాజీ మంత్రి రోజ స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రశ్నలతో సీఎం చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని కామెంట్లు చేశారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబునాయుడు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. కోర్టు సరైన విధంగా విచారణ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని రోజా తెలిపారు.

లడ్డూల దొరికిపోయారు..
లడ్డు విషయంలో ఏర్పాటు చేసిన సిట్ విచారణ పై తమకు నమ్మకం లేదని ఈ సందర్భంగా మంత్రి రోజా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక తిరుపతి లడ్డు వ్యవహారంలో కూటమి నేతలు అడ్డంగా ఇరుక్కుపోయారని, లడ్డు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ బాబు లడ్డూల దొరికిపోయారు అంటూ మాజీ మంత్రి అంబంటి రాంబాబు కూడా సెటైర్లు వేశారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!