Taraka Ratna: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం అనే పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి నందమూరి తారకరత్న ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు.ఇలా స్పృహ తప్పి పడిపోవడంతో ఈయన శరీరం మొత్తం నీలిరంగులోకి మారడంతో ఒకసారిగా పార్టీ శ్రేణులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మొదట సమీప ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం తారకరత్నను పీఎస్‌ఈ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పీఎస్‌ఈ వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ లు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తారకరత్న శరీరం నీలిరంగులోకి మారిపోవడానికి గల కారణాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.
తారకరత్న శరీరం నీలిరంగులోకి మారడానికి గల కారణం ఆయన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం అని తెలిపారు. సాధారణంగా మన శరీరంలో ఏ అవయవానికి అయితే రక్తం సరఫరా కాదో ఆ అవయవం మొత్తం నీలిరంగులోకి మారిపోతుంది ఉదాహరణకు కాళ్లు చేతి వేళ్ళకొన వరకు రక్తం సరఫరా కాకపోతే వేళ్ళ కొనభాగం నీలిరంగులోకి మారుతుంది.

Taraka Ratna:తారకరత్నకు పల్స్ పూర్తిగా పడిపోయింది…
ఈ క్రమంలోనే తారకరత్న శరీరంలో కూడా రక్త సరఫరా రేటు తగ్గిపోవడంతో ఆయన శరీరం మొత్తం నీలిరంగీలోకి మారిపోయిందని డాక్టర్ ముఖర్జీ వెల్లడించారు. ఇలా శరీరం నీలిరంగులోకి మారిపోవడంతో వెంటనే చికిత్స అందించామని సుమారు 45 నిమిషాల పాటు శ్రమించిన తర్వాతే పల్స్ మొదలైందని వైద్యులు తెలిపారు.
































