Tarakaratna: నందమూరి తారకరత్న మరణ వార్త చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.ఈయన మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులలోను అభిమానులలోను తీవ్ర విషాదం నింపింది.ఇక ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈయన ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.

తారకరత్న ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మాత్రమే కాకుండా కొన్ని నెగటివ్ పాత్రలలో కూడా నటించారు. ఇక అమరావతి సినిమాలో ఈయన నటించిన విలన్ పాత్రకు గాను ఏకంగా నంది అవార్డు కూడా వచ్చింది.ఇలా హీరోగా కాకుండా విలన్ గా కూడా ఈయన నటించారు. అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి గల కారణం ఏంటి అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ రికార్డు సృష్టించారు. అలాగే ఈయన వారసులుగా హరికృష్ణ బాలకృష్ణ వంటి హీరోలు కూడా ఇండస్ట్రీలో కొనసాగారు. ఇకప్రస్తుత జనరేషన్లో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఈ హీరోలు సాధించిన విధంగా తారకరత్న మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయారు.

Tarakaratna: సరైన కథలను ఎంచుకోకపోవడం…
ఇండస్ట్రీలో ఒక వ్యక్తి హీరోగా సక్సెస్ సాధించాలి అంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏమాత్రం సరిపోదని వారి సొంత టాలెంట్ కూడా ఉండాలని చెబుతారు అయితే తారకరత్న మాత్రం నటనలో ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి అని చెప్పాలి అయితే ఈయన టాలెంట్ ఉండి,ఎంతో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి గల కారణం సరైన కథలను దర్శకులను ఎంపిక చేసుకోకపోవడమే కారణమని తెలుస్తోంది. అలాగే ఈయనకు అదృష్టం కూడా కాస్త తక్కువగా ఉండడంతో హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయారని పలువురు భావిస్తున్నారు.
































