Tasty Teja: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 13వ వారం నేటితో ముగియనుంది. ఇక ఈ వారంలో డబల్ ఎలిమినేషన్ జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఓటింగ్ పరంగా లిస్టులో పృథ్విరాజ్ ముక్కు అవినాష్ చివరిగా టేస్టీ తేజ ఉండగా ముక్కు అవినాష్ టికెట్ టు ఫినాలే రేసులో భాగంగా టాప్ ఫైవ్ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక చివరిగా టేస్టీ తేజ అలాగే పృథ్వీరాజ్ ఉండడంతో వీరిద్దరూ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తుంది.

ఇకపోతే టేస్టీ తేజ ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం తెలియడంతో ఈయనకు బిగ్ బాస్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చిందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. టేస్టీ తేజ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని తొమ్మిది వారాలపాటు హౌస్ లో ఉన్నారు అయితే ఈయన అప్పట్లో వారానికి 1.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలిసింది.
ఇక సీజన్ 8 కార్యక్రమంలో కూడా ఈయన వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా 6 వారం నుంచి హౌస్ నుంచి హౌస్ లో కొనసాగుతున్న టేస్టీ తేజ 13వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన బిగ్ బాస్ నుంచి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయంపై వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Tasty Teja: 4 లక్షలు…
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ నుంచి టేస్టీ తేజ వారానికి 4 లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఇలా 8 వారాలకు గాను సుమారు 30 రెండు లక్షల రూపాయల వరకు ఈయన బిగ్ బాస్ నుంచి రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది. ఇక సీజన్7 తో పోలిస్తే సీజన్ 8 లోనే ఈయన అధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నారని చెప్పాలి.































