Tejaswini Madivada: మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తేజస్విని మదివాడ.తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అలాగే కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా చేశారు.ఇలా పలు సినిమాలలో నటించిన ఈమెకు రాని గుర్తింపు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.

ఈ సినిమాలో ఈమె ఎన్నో బోల్డ్ సన్నివేశాలలో నటించి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా నుంచి తేజస్విని ఐస్ క్రీమ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈమె నటించిన కమిట్మెంట్ సినిమా ఈ నెల 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని మాట్లాడుతూ తాను కంటెంట్ డిమాండ్ చేస్తే ఎలాంటి బోల్డ్ సన్నివేశాలలో అయినా కిస్ సన్నివేశాలలో అయినా నటించడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పనని వెల్లడించారు.ఇక కమిట్మెంట్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఇందులో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని శ్రీనాథ్ తనతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారంటూ చెప్పుకొచ్చారు.

Tejaswini Madivada: ఎవరు కమిట్మెంట్ అడగలేదు…
ఇక ఇండస్ట్రీలో తనని ఎవరూ కూడా కమిట్మెంట్ ఇవ్వమని అడగలేదని, అలా అడగాలన్న భయపడతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈమె నటించిన ఈ కమిట్మెంట్ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాపై ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ఇలా ఎన్నో విమర్శలు నడుమ ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ విడుదల కానుంది అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.































